Home

»

Tv News

Agnipariksha season2 : కళ్యాణ్ పడాల ఎంట్రీతో హైఓల్టేజ్ డ్రామా.. అమన్‌ను వరించిన మూడో ఫైర్ కార్డ్!

Aug 23, 2026 12:20PM

బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి వస్తాడు. వాడు రాగానే స్టేజ్ మొత్తం మారిపోయింది. నేను బిగ్ బాస్ గెలిచానంటే దానికి కారణం అగ్ని పరీక్షే, ఇక్కడి జడ్జ్ లు, హోస్ట్ లే అని ఎమోషనల్ గా చెప్పాడు. వస్తూనే అమన్ ని పిలిచి, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ 10 విన్నర్ అయితే ఎలా స్పీచ్ ఇస్తావనే టాస్క్ ఇస్తాడు. అమన్ కూడా బిగ్ బాస్ 9 ట్రోఫీ పట్టుకుని అదిరిపోయే స్పీచ్ ఇచ్చి ఇంప్రెస్ చేశాడు.

ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది. ఈ టాస్క్ కోసం అమన్, మిథిలేష్, రోహిత్ సెలెక్ట్ అయ్యారు. రెండు లెవెల్స్, ఫస్ట్ జెండా పాతడం, సెకండ్ పిల్లోస్ కలెక్ట్ చేయడం. ఫస్ట్ లెవెల్ లోనే మిథిలేష్ ఔట్ అయిపోయాడు. ఇక పిల్లో టాస్క్ లో అమన్, రోహిత్ ఇద్దరూ ఫుల్ ఫిజికల్ అయిపోయారు. గొడవ పెద్దదవుతుందని శ్రీముఖి అపూర్వని సంఛాలక్ గా పెట్టింది.. అయినా ఆపలేదు.

లాస్ట్ కి అపూర్వ తీర్పు ఇచ్చింది. పిల్లోస్ ఎక్కువ అమన్ దగ్గర ఉన్నా, రోహిత్ ఫిజికల్ తక్కువ చేశాడని వాడినే విన్నర్ అంది. దాంతో శ్రీముఖి, అభిజిత్, బిందు ముగ్గురూ సీరియస్ అయ్యారు. నీ ఇష్టానికి రూల్స్ మారుస్తావా అని అపూర్వని పక్కన పెట్టేసి, ఎక్కువ పిల్లోస్ ఉన్న అమన్ నే విన్నర్ అని ప్రకటించారు. ఈ థర్డ్ కార్డ్ పవర్ ఏంటో సీక్రెట్ గా ఉంచారు. ఆ కార్డ్ ని జ్యూరీ దగ్గర పెట్టారు. అమన్ మాత్రం ఆ పవర్ ని బిందు మాధవి దగ్గరే ఉంచమన్నాడు. ఆమె నాకు రెడ్ ఇచ్చినా నమ్మకం ఉందని చెప్పాడు.

 

Agnipariksha Season 2, Kalyan Padala, Bigg Boss Telugu updates, Aman Rohit pillow task, TeluguOne entertainment

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com