బిగ్ బాస్ సీజన్-10 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా అగ్ని పరీక్ష సీజన్-2 లో ఎనిమిదో ఎపిసోడ్ తో అసలు గేమ్ మొదలైందని చెప్పాలి. ఇప్పటిదాకా నామినేషన్లు, చిన్న చిన్న టాస్కులు అనుకుంటే, ఇప్పుడు ఫైర్ కార్డ్స్ వచ్చాయి. ఈ కార్డ్స్ అంటే మామూలు పవర్స్ కాదు, ఒకసారి చేతికి వస్తే గేమ్ నే మార్చేయొచ్చు. అందుకే అందరి కళ్ళు ఆ కార్డ్స్ మీదే పడ్డాయి.
ఈ ఎపిసోడ్ కి స్పెషల్ టచ్ ఏంటంటే.. సీజన్ 9 వాళ్ళని తీసుకురావడం. ప్రియాశెట్టి, మర్యాద మనీష్, కళ్యాణ్ పడాల ముగ్గురూ వచ్చి టాస్కులు ఆడించారు. వాళ్ళు వస్తూనే మీరు ఇంకా గ్రూపులు కట్టలేదా, ఇక్కడ ఫ్రెండ్షిప్ లు చూడకూడదు, పక్కనోడిని దాటేసి వెళ్లాలని గట్టిగానే చెప్పారు. కళ్యాణ్ అయితే నేను బిగ్ బాస్ విన్నర్ అయ్యానంటే అగ్నిపరీక్ష వల్లే అని చెప్పి కొత్త వాళ్లకి ఇంకా కసి పెంచాడు.
ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మూడు ఫైర్ కార్డ్స్, మూడు డిఫరెంట్ గేమ్స్, చాలా ఫిజికల్, మైండ్ గేమ్ కనిపించింది. నవదీప్ మధ్యలో వెళ్లిపోవడం, సంఛాలక్ గా ఉన్న అపూర్వ తప్పు తీర్పు ఇవ్వడం, జడ్జెస్ దాన్ని కరెక్ట్ చేయడం, చివరికి పవర్స్ ని సీక్రెట్ గా పెట్టడం - అన్నీ కలిపి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ కార్డ్స్ ముందు ముందు ఎవరి తలరాతలు మారుస్తాయో చూడాలి మరి.
Agnipariksha Season 2, Bigg Boss Telugu, Fire Cards, Priya Shetty Maryada Manish Kalyan Padala, TeluguOne entertainment




