Home

»

Tv News

Agnipariksha season 2 : అగ్నిపరీక్షలో గందరగోళం..నవదీప్ షాకింగ్ కామెంట్స్!

Aug 29, 2026 9:05AM

అగ్నిపరీక్షలో ఇప్పటివరకు సైలెంట్ గా, కెమెరాకు కనిపించకుండా దాక్కున్న నలుగురు కంటెస్టెంట్లకు నిన్నటి ఎపిసోడ్ లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. హేమంత్, ప్రియాంక, చరణ్, భాగి .. వీళ్లు ఆటలో లేరు.. వీళ్ల ఎమోషన్ కనిపించడం లేదని జ్యూరీలు నేరుగా స్టేజ్ మీదకు పిలిచి నిలదీశారు. ఇది వాళ్లకు లాస్ట్ ఛాన్స్ లాంటిది. మీరు ఎందుకు ఉండాలి, మిగతా వాళ్లకంటే మీరు ఏ విషయంలో గొప్ప అని నిరూపించుకోవాల్సిన టాస్క్ ఇచ్చారు. 

 

కానీ ఈ ఛాన్స్ ని ఆ నలుగురు అస్సలు వాడుకోలేకపోయారు. చరణ్ ఏదో చెప్పబోయి బిందు మాధవి చేతిలో దొరికిపోయాడు. భాగి ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేకపోయింది. హేమంత్, అపూర్వ ముందు తడబడ్డాడు. ఇక ప్రియాంక అయితే టాస్క్ నే అర్థం చేసుకోలేదు. పాయింట్ చెప్పమంటే కథ చెప్పింది. దీంతో నవదీప్.‌ మ్యాటర్ కి రా అని, బిందు.. కథథలు వద్దు అని అరిచారు. జ్యూరీ ఆపమన్నా ఆగకుండా గొడవపడటంతో శ్రీముఖి కోప్పడింది. మీకు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వేస్ట్ చేశారు, మా టైం వేస్ట్ చేశారని శ్రీముఖి ఫైర్ అయింది.ఆ తర్వాత వచ్చిన నంబర్ టాస్క్ అసలు అగ్నిపరీక్ష అంటే ఏంటో చూపించింది. ఇది కేవలం లెక్కల గేమ్ కాదు, మైండ్ గేమ్. గడ్డిలో నంబర్లు వెతకడం, కరెక్ట్ టోటల్ వచ్చేలా మనుషుల్ని కన్విన్స్ చేసుకోవడం .. ఇందులో ప్రియాంక మళ్లీ ఫెయిల్ అయింది. తన నంబర్ ని ఈజీగా దీపక్ కి ఇచ్చేసింది. ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డ్ ఉందని తెలిసి కూడా ఆమె టీంలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క తప్పుతోనే ఆమెకు ఎల్లో కార్డ్ పడేందుకు బేస్ రెడీ అయింది. ఆటలో తెలివి ఎంత ముఖ్యమో ఈ టాస్క్ ప్రూవ్ చేసింది.

 

లీడర్ సెలక్షన్ లో కూడా కంటెస్టెంట్ల బలహీనత బయటపడింది. లీడర్ అంటే ఎవరో ఒకరిని పేరు చెప్పడం కాదు.. నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండాలి.  గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్ రెండూ జ్యూరీ ఒక్క మాట అనగానే లీడర్ ని మార్చేశాయి. మీకంటూ ఒక స్టాండ్ లేదా? బ్యాడ్ పర్ఫామెన్స్ అంతా లీడర్లు అవుతున్నారని నవదీప్ క్లాస్ పీకాడు. ఒక్క చరణ్ టీం మాత్రమే హెల్దీగా డిస్కస్ చేసుకుని చరణ్ ని లీడర్ గా పెట్టింది దాన్నే నవదీప్ బెస్ట్ డిబేట్ అని మెచ్చుకున్నాడు. ఫైనల్ టాస్క్ లో ఝాన్సీ తెలివిగా తన హెడ్ స్టార్ట్ కార్డ్ ని వాడి తన టీమ్ ని గెలిపించింది. కానీ గెలిచాక కూడా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో తెలియక తికమక పడ్డారు. ఫైనల్ గా రామకృష్ణ, రోహిత్ లకు ఓట్ అప్పీల్ దక్కగా అన్ని చోట్ల ఫెయిల్ అయిన ప్రియాంకకు ఎల్లో కార్డ్ తో పాటు డేంజర్ జోన్ శిక్ష పడింది. ఫైనల్ గా ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉందో వెతికితీసే పనిలో పడ్డారు జడ్జెస్.ఈ అగ్నిపరీక్ష ముగిసేలోపు ఎవరు స్ట్రాంగ్.. ఎవరు వీక్ కంటెస్టెంట్ తేలిపోతుంది. ఆయితే బయట ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళని, సోషల్ మీడియాలో బజ్ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఎప్పటికి ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్ లలో ఎవరు బిగ్ బాస్ సీజన్-10 లోకి వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com