
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. లోకల్ స్టార్స్ వెర్సెస్ పాన్ ఇండియా స్టార్స్ థీమ్ తో రాబోతోంది. ఇమ్ము మీద శ్రీముఖి పంచులు తెగ వేసింది. ఇమ్ము ఎమోజిస్ తో ఉన్న షర్ట్ వేసుకొచ్చాడు. "వీడు అసలైన లోకలర్ అంటే. వాడు ఒకసారి లో లో ఉన్నప్పుడు ఒకసారి నాకు చేసాడు. అప్పటి నుంచి లోకల్ లోకల్ ఐపోయాడు" అంది శ్రీముఖి. దాంతో అందరూ నవ్వేసుకున్నారు. ఇక అవినాష్ ఐతే "ఈ ఎంటర్టైనర్స్ కి కప్పొచ్చే దిక్కే లేదా" అంటూ దేవుడిని తెగ ప్రార్దించేసాడు. వెంటనే హరి చెయ్యెత్తి మరీ "మన కమెడియన్స్ కి కప్పు తేవడానికి నేను వెళ్తున్నా అన్నా" అన్నాడు . వెంటనే ఇమ్ము తగులుకున్నాడు. "నిన్నెవరూరా కమెడియన్ అన్నోడు" అనేసరికి హరి కూడా ఆన్సర్ ఇవ్వకుండా నవ్వేసాడు. ఇంతలో సుజిత ధనుష్ వచ్చింది. " కూకు విత్ జాతిరత్నాలు విన్ అయ్యాం కదా అప్పుడు ఇమ్మానుయేల్ కి మంచిగా భోజనం పెట్టి పెట్టి ఇంత లావుగా చేసి పంపించాం.
బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు సగమే ఉన్నాడు మిగతా సగం ఎక్కడా " అని పెద్ద ప్రశ్న అడిగింది. "మిగతా సగం టాస్కుల్లో పోయింది" అని చెప్పాడు ఇమ్ము. "పాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా. నన్నెందుకు తీసుకెళ్లి పాన్ ఇండియాలో పెట్టారు నేను లోకల్ పక్క లోకల్ " అన్నాడు శివ్ . "అలా చూసుకుంటే పదేళ్ల నుంచి ఈడ ఉన్నా " అంటూ మధ్యలో అడ్డొచ్చింది ప్రిన్సి. "అదే ఎందుకున్నావ్ అని అడుగుతున్నాం మేమిక్కడ " అంటూ మధ్యలో వచ్చి కామెడీగా అడిగాడు అవినాష్. ఇక ఫైనల్ గా బాలుని చూసి శ్రీముఖి తెగ సిగ్గుపడిపోయింది.







