
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం బాచిలర్స్ పార్టీ థీమ్ తో రాబోతోంది. అందులో బాలు కూడా స్పెషల్ గా కనిపించాడు. అతనితో శ్రీముఖి చాలా పనులు చేయించింది. " బాలు ముగ్గేస్తావా నువ్వు " అంటూ శ్రీముఖి గోముగా ముద్దుగా అడిగింది. "చిన్నప్పుడు ఇంట్లో చేసే అలవాటుంది " అన్నాడు అంతే శ్రీముఖి బాలు బుగ్గలు నొక్కి హజ్బెండ్ మెటీరియల్ నువ్వు " అంది. అంతే బాలు సిగ్గుపడిపోయాడు. తర్వాత బాలు చుక్కలు పెడుతూ ముగ్గేస్తుంటే అవినాష్ వచ్చి "ఏంటి దిష్టిబొమ్మ వేస్తున్నాడు ఓహ్ అమ్మగారి బొమ్మా " అన్నాడు. తర్వాత శ్రీముఖి "చాలా నచ్చింది ఏంటో తెలుసా ఐదు చుక్కలు వేసాడు తర్వాత నాలుగు చుక్కలు వేసాడు తర్వాత మూడేసాడు " అంది. "అన్నేసినప్పుడు ముగ్గేయొచ్చుగా మరి " అన్నాడు అవినాష్. తర్వాత అబ్బాయిలకు బట్టలు ఉతికే టాస్క్ ఇచ్చింది.
"పండన్నా చూడు ఎంత నేచురల్ గా ఉతుకుతున్నాడో " అన్నాడు హారి. తర్వాత హిమజ బట్టలు ఉతుకుతూ "ఏంటి సెట్ లో ఉన్నవాళ్లందరి బట్టలు ఉతికిస్తున్నారా మాతో...ఎవడ్రా సాక్సులు వేసింది " అంది. "మనదే ఒకటి అక్కడ ఉందా " అన్నాడు నిఖిల్ మలయక్కల్. తర్వాత బాయ్స్ తో అంట్లు తోమించింది. "ఇదేంటి ఇలాగే చేస్తారా మీరు సరిగ్గా తోమంది " అంటూ వాటర్ టబ్బులోకి గిన్నెను విసిరికొట్టాడు అవినాష్. అంతే నిఖిల్ విజయేంద్ర సింహ నీళ్లు విసిరాడు అతని ముఖం మీదకు. "మా లేడీస్ చూడండి ఎంత నీట్ గా తోమారో " అంటూ అవినాష్ ఒక ప్లేట్ ని శ్రీముఖికి చూపించాడు. "ఎంత నీట్ గా తోమారో చూడండి" అంటూ సరిగా తోమలేదు అని ఇండైరెక్ట్ గా చెప్తూ ప్లేట్ ని విసిరికొట్టింది.






