బిగ్ బాస్.. అదొక పెయిన్ ఫుల్ షో..సుధీర్‌తో నాకు కుదిరింది!
on Nov 4, 2025

బుల్లితెర మీద విష్ణు ప్రియా గురించి తెలియని వారు ఎవరూ లేరు. అలాంటి ఆమె ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ నుంచి ఎం లేదు నేర్చుకోవడానికి. ఆల్రెడీ నా లైఫ్ నాకు అన్నీ నేర్పించేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లి నేర్చుకునేంత ఐతే ఏమీ లేదు. కాకపొతే నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. యాష్మి, సీత, పృథ్వి, నిఖిల్, ప్రేరణ వంటి వాళ్లంతా దొరికారు. బిగ్ బాస్ 9 కి కాల్ వస్తే నేను మాత్రం వెళ్ళను. ఒక్కసారి వెళ్ళినందుకే నన్ను నేను తిట్టుకున్నా. ఎందుకు వెళ్ళావ్, ఎందుకు వెళ్ళావ్ అని చెప్పు తీసుకుని కొట్టుకోకుండా ఆగిపోయా..బయటకు వచ్చాక షోని తిడదాం అనుకున్నా కానీ జనాలు ఇంత ప్రేమ చూపించేసరికి ఏమీ అనలేకపోయా.
ఇంట్లో ఐతే నేను వర్క్ చేసుకుని కావలసినప్పుడు మసాజ్ చేయించుకుని మళ్ళీ శక్తి వచ్చాక వర్క్ చూసుకునేదాన్ని. కానీ బిగ్ బాస్ హౌస్ లో నిద్ర లేదు, మసాజ్ లేదు, కాఫీ లేదు, టీ లేదు అదొక పెయిన్ ఫుల్ షో. జారీ జరీ సాంగ్ తర్వాత నాకు కాల్స్ వస్తాయి, సెలెక్షన్స్ లో నేను బిజీ ఐపోతానేమో అనుకున్నా. అవకాశాలు వచ్చాయి కానీ గ్రేట్ సాంగ్స్ కాదు. బెస్ట్ సాంగ్స్ అన్నీ వేరే వాళ్లకు వెళ్లిపోతున్నాయి. బిగ్ బాస్ నుంచి వచ్చాక అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నా. కానీ ఏమీ లేదు..స్లోగా వెళ్తోంది బండి..నేను స్టార్టింగ్ యాంకరింగ్ చేసే టైములో ఇలా రాగానే అలా పేరు తెచ్చేసుకుంది ఏమిటి అనేవాళ్ళు. అప్పుడేదో సుధీర్ ఉన్నాడు కాబట్టి యాంకరింగ్ అలా టామ్ అండ్ జెర్రీలా కుదిరింది. కానీ ఇప్పుడు సోలోగా చేయలేను. నాకు ఉన్న నత్తికి, నాకున్న మెంటల్ కాన్సంట్రేషన్ కి అస్సలు చేయలేను. యాంకరింగ్ టైములో నా వీక్ నెస్ లు ఈజీగా తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కవర్ సాంగ్స్ అని, మూవీస్ నుంచి సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి" అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



