నా లైఫ్ లో ది బెస్ట్ మా నాన్న అంటున్న దివిజ
on Jun 29, 2022
ప్రభాకర్ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఒకప్పటి ఋతురాగాలు సీరియల్ నుంచి చిన్న చిన్నగా మొదలైన ప్రయాణం ఇప్పుడు మూవీస్ లో కూడా యాక్ట్ చేసేవరకు ఎదిగారు. ప్రభాకర్ వైఫ్ మలయజ, కూతురు దివిజ..ఇక దివిజ ఫాదర్స్ డేని రీసెంట్ గా సెలెబ్రేట్ చేసింది. ఎందుకంటే తన హయ్యర్ స్టడీస్ కోసం హాస్టల్ కి వెళ్ళిపోతున్న సందర్భంగా ఫాదర్స్ డే రోజున కాకుండా ఆ తర్వాత సెలెబ్రేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపిస్తాను అంటూ నెటిజన్స్ కి బై కూడా చెప్పేసింది. ఇక సర్ప్రైజ్ చేయడానికి ప్రభాకర్ కి ఇష్టమైన పెర్ఫ్యూమ్ బాటిల్, ఒక షర్ట్, ఒక కేక్ తీసుకుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది దివిజ. ఒక రైటర్ తో డిస్కషన్స్ లో ఉన్నాను నైట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి అని చెప్తాడు.
ఇక వెంటనే గిఫ్ట్స్ అన్నీ వాళ్ళ ఆఫీస్ కే తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తుంది దివిజ. ప్రభాకర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫాదర్స్ డే ఏమిటి అనేసరికి హాస్టల్ కి విల్లిపోతున్నా కాబట్టి ఇలా ప్లాన్ చేశా అని చెప్తుంది దివిజ. ప్రభాకర్ ఫామిలీలో ఇప్పటివరకు ఎవరూ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి దివిజాని చదివించాలనే పట్టుదలతో చదివిస్తున్నాను అని చెప్తాడు. ఐతే దివిజ తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పేసరికి యాక్టింగ్ ఎప్పుడైనా చేయొచ్చు ముందు చదువు ఇంపార్టెంట్ అని చెప్తాడు ప్రభాకర్. తనకు చాలా హై గోల్ ఉందని అది రీచ్ అయ్యాక వస్తానని చెప్తుంది దివిజ. డాడీ తన లైఫ్ లో ది బెస్ట్ అంటుంది. నాన్న నాకు నువ్వు ఏమైతే చేసావో అన్నిటికి థ్యాంక్స్ అని చెప్తుంది.
ఇక మలయజ కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఫాదర్స్ డే విషెస్ చెప్తుంది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఒక వేళ ఏదైనా తప్పు చేస్తే క్షమించు.. మనిషిగా ఎదిగేలా ఛాన్స్ ఇవ్వు. నువ్వు ఎప్పుడూ నా వల్ల తల దించుకునే పరిస్థితి రానివ్వను. గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను ఇది నా ప్రామిస్ అని వాళ్ల నాన్న మీద ప్రేమను తన మాటల్లో చెప్తుంది దివిజ. ఇది సూపర్ వీడియో, నాన్నకు మంచి కూతురు ఉంది, అక్కా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read