సుమ అడ్డానా...బిగ్ బాస్ కి జూనియర్ షోనా ?
on Dec 11, 2024
ఓడియమ్మ ఇది సుమ అడ్డానా లేదంటే బిగ్ బాస్ బజ్ కి మరో జూనియర్ షోనా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో జరిగే గందరగోళాలు ఒకరి మీద ఒకరు ప్రశ్నలతో దాడులు చేసుకోవడాలు చూసాం.. ఇప్పుడు సుమ అడ్డాలో కూడా అలాగే జరుగుతోంది. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆర్జేలు చైతు, సూర్య, యాంకర్ శివ వచ్చారు. అలాగే లేడీస్ లో అష్షు రెడ్డి, రీతూ చౌదరి, నేహా చౌదరి వచ్చారు.
వీళ్లకు రకరకాల టాస్కులు పెట్టింది సుమ. ఇక ప్రోమో ఫైనల్ లో మాత్రం రకరకాల ప్రశ్నలు అడిగేసుకుని తెగ ఫీలైపోయారు ఒకరికొకరు. "ఎక్స్పోజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యావు అని చెప్పి ఆడియన్స్ ఒపీనియన్" అని యాంకర్ శివ అడిగేసరికి "నేనసలు ఎక్కడా ఉండను" అని చెప్పింది. "ఆర్జే చైతు ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నావు అని అది బ్రేకప్ అయ్యిందని" అంటూ యాంకర్ శివ అడిగాడు "అది నా ఇష్టం, నా జీవితం, నేను ఏదనుకుంటే అది చేసుకుంటా ఎవరికీ సంబంధం" అన్న రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. "ఎదుటి వాళ్ళ ఫామిలీస్, వాళ్ళ ఎమోషన్స్ తో నాకేం సంబంధం లేదు అన్నట్టు క్లబ్బులో జరిగే సీన్స్ మీద, పోలీసు కేసుల మీద నువ్వు ప్రశ్నలు అడుగుతావు కదా ..ఒకవ్వేలా నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే ..ఎం చెప్తావ్ ..అప్పుడు నీకు కూడా బుర్ర ఉండాలి కదా " అంటూ అష్షు రెడ్డి ఘాటుగానే అడిగింది యాంకర్ శివని.."నేను సమాధానం చెప్తా" అని చెప్పాడు శివ. ఇలా వీళ్ళ మధ్య ఘాటుగా ఒక ప్రస్నోత్తరాల పరంపర కొనసాగింది. ఇక ఈ షో ఎంట్రీలో ఆర్జే చైతుని చూసి సుమా ఒక పాటేసుకుంది. "ఎన్నాళ్ళయింది ఈ అడ్డాకి వచ్చి" అని చైతు అనేసరికి "ఎన్నాళ్లకు పెద్దపండగ వచ్చే" అని పాడింది. "ఎన్నాళ్లకు పెద్దమ్మను కలిసే" అంటూ సుమని పట్టుకుని చైతు పెద్దమ్మ అనేశాడు. దాంతో సుమ కూడా షాకైపోయింది.
Also Read