ఆ రింగ్ నాకు చాలా ఇంపార్టెంట్...
on Nov 4, 2025

జయమ్ము నిశ్చయమ్మురా షో మంచి రేటింగ్ తో ముందుకు సాగుతోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో చూస్తే ఇంకేముందు రాబోతోంది వరల్డ్ వైడ్ క్రష్ రష్మిక మందన్న. ఇక ఈవిడ స్టేజి మీద ఎంట్రీ ఇచ్చేసరికి శ్రీవల్లి సాంగ్ కూడా ప్లే అయ్యింది. ఒక రకంగా నేను నీకు ఒక నిక్ నేమ్ పెట్టాను గాలి పిల్లా అని అంటూ జగ్గు భాయ్ రష్మికకు చెప్పేసరికి అయ్యయ్యో అనేసింది. "విజయ్ దేవరకొండ ఫ్రెండ్ షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్ ఆల్ టైం ఫ్యాన్..అంటే విజయ్ ని, విజయం మొత్తాన్ని సొంతం చేసేసుకున్నావా నువ్వు" అని జగ్గు భాయ్ అడిగారు. ఇక ఆ ప్రశ్నకు రష్మీక ఎం ఆన్సర్ చెప్పకుండా ఆడియన్స్ వైపు తిరిగి కన్ను కొట్టింది.
ఇక బ్యాక్ గ్రౌండ్ లో "ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస" అనే సాంగ్ ప్లే అయ్యింది. "అప్పుడున్న రష్మికను చూద్దామా ఒకసారి" అంటూ రష్మిక చిన్నప్పటి గౌన్ వేసుకున్న ఫోటోని చూపించారు. "ఐ థింక్ ఇది చెన్నైలో తీసింది" అని చెప్పింది. "అప్పటికే విజయ్ ఫ్యాన్ ఆ" అని జగ్గు భాయ్ అడిగారు. "అలాగే కనిపిస్తోంది మరి" అని చెప్పింది రష్మిక. "ఒక చేతిని వెనక పెట్టుకుని వీధి మొత్తం ఆ పాట పాడుతూ వెళ్లేదాన్ని"..వెంటనే "రోజావే చిన్ని రోజావే" అనే సాంగ్ ప్లే అయ్యింది. "చిన్నప్పుడు ఎలా నడిచావో నడిచి చూపించవా" అనేసరికి రష్మిక అలాగే స్టేజి మీద కాసేపు నడిచి చూపించింది. ఇక ఆమె చేతికి ఉన్న ఉంగరాల గురించి అడిగారు. "ఆ రింగ్స్ ఏమన్నా సెంటిమెంటా లేకపోతే" అని అడిగారు. "అంటే చాలా ఇంపార్టెంట్ రింగ్స్" అని చెప్పింది. "అంటే అందులో ఒక రింగ్ ఫేవరేట్ అయ్యి ఉంటుంది. దాని వెనక ఏదన్నా హిస్టరీ ఉంది" అని జగ్గు భాయ్ చెప్పేసరికి రష్మిక ఆన్సర్ చెప్పకుండా నవ్వేసింది. ఇక ఆడియన్స్ గోల చేస్తూ అరిచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



