రోహిణికి తగ్గ వరుడు దొరికేసాడోచ్..!
on Jan 11, 2026

బుల్లితెర మీద లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రోహిణి. ఆమె లేని షో లేదు. ఐతే బుల్లితెర మీద పెళ్లి కావలిసిన వాళ్ళల్లో ఆది, సుధీర్, ప్రదీప్, శ్రీముఖి తర్వాత రోహిణి ఉంటుంది. ఇక శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని చెప్తోంది. ఇప్పుడు రోహిణి తనకు నచ్చిన వరుడు దొరికేసాడు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఒక క్యూట్ గా ఉన్న అబ్బాయితో కలిసి ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది.
"ఫైనల్లీ నాకు కావాల్సిన వ్యక్తిని కలుసుకున్నా" అంటూ కూడా పెట్టుకుంది. ఈ పోస్ట్ కి ఆరియానా, సమీరా భరద్వాజ్, ప్రియా, సురేఖావాణి, గీతామాధురి, యాట నవీన వంటి వాళ్లంతా రియాక్ట్ అయ్యారు. "అక్క సీరియస్లి ఒక్క క్షణం చూసి నిజమే అనుకుని సంతోషపడ్డా." అని ఆరియానా పెట్టిన కామెంట్ కి "నిజం ఐతే బాగుణ్ణు" అంటూ రోహిణి రిప్లై ఇచ్చింది.
ఇక సమీరా ఐతే "డిస్క్రిప్షన్ చదవని వాళ్ళు ఎర్రిపప్పలు . పోనిలే ఇలాంటి హ్యాండ్సమ్ హజ్బెండ్ ప్రాప్తిరస్తూ" అంటూ దీవించేసింది. "నీకు ఇంతకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు ఇన్ అండ్ అవుట్" అంటూ ప్రియా కామెంట్ చేసింది. "కంగ్రాట్స్ రా..గాడ్ బ్లేస్ యు" అంటూ సురేఖావాణి చెప్పింది. "సరే ఇప్పుడు ఇతని కోసం వెతుకుదాం" అంటూ గీతామాధురి కామెంట్ చేసింది. "తధాస్తు ఇంకేంటి ఇంతకంటే హ్యాండ్సమ్ అండ్ గుడ్ పర్సన్ రావాలి" అంటూ యాట నవీన్ విష్ మెసేజ్ పెట్టింది.
ఇలా ప్రతీ ఒక్కరు రోహిణికి మంచి అబ్బాయి రావాలని కోరుకుంటున్నారు. ఐతే డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం అది ఒక ఏఐ జెనెరేటెడ్ పిక్ అన్నమాట. ఇక రోహిణి ఐతే ఇలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ ని చూపించినందుకు చాట్ జిపిటికి థ్యాంక్స్ కూడా చెప్పుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



