Karthika Deepam2: జ్యోత్స్నకి చురకలు వేసిన దీప.. భార్యకి సపోర్ట్ గా కార్తీక్!
on Dec 10, 2024
కార్తీక్ ను తినకుండా చేసి ఆఫీస్ కి రప్పించి.. కొన్ని ఫైల్స్ చేతిలో పెడుతుంది జ్యోత్స్న. ఇవన్నీ నీ ఆధ్వర్యంలో నడిచిన ఫైల్స్ వీటిలో క్లారిటీ లేకే నిన్ను రమ్మన్నానని జ్యోత్స్న అంటుంది. వెంటనే కార్తీక్ బెల్ కొట్టి ఆఫీస్ బాయ్‌ని పిలిచి.. ప్రభాకర్‌ని రమ్మను అంటాడు. వెంటనే ప్రభాకర్ రాగానే.. ఇవన్నీ నీ ఆధ్వర్యంలో అంటోంది. అప్పుడు నువ్వు చూసిన ఫైల్సే కదా ఇవి. నీకు తెలియదా.. నువ్వు చెప్పొచ్చు కదా.. ముందు మేడమ్ గారికి నువ్వు వివరించు. డౌట్ వస్తే అప్పుడు నా దగ్గరికి రా.. తినకుండా రప్పించారు.. ఈ ఆఫీస్‌లో కొందరికి బుర్ర సరిగా పని చేయదనుకుంటా అని తన క్యాబిన్‌కి వెళ్లిపోతాడు కార్తీక్.
కాసేపటికి ప్రభాకర్ వచ్చి.. సర్ మిమ్మల్ని డైనింగ్ హాల్‌కి రమ్మంటున్నారు మేడమ్.. అక్కడ మాట్లాడతారట అని కార్తీక్ తో అంటాడు. ఏం తింటూ మాట్లాడతారా అని కార్తీక్ అనగా... అప్పటికే అవసరం లేని దాని కోసం రప్పించి తినకుండా చేసిందన్న కోపంలో ఉన్నాడు కార్తీక్. తీరా కార్తీక్ డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్లేసరికి.. రా బావా తినకుండా వచ్చావని తెలిశాకా నువ్వు తినకపోతే నాకు నీరసం వచ్చేలా ఉంది. కూర్చో తింటూ మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లొచ్చా.. నాకు ఇల్లు ఉంది. అందులో వండి పెట్టే పెళ్లాం ఉందని కార్తీక్ అంటాడు. నిన్ను పిలిపించిన పని పూర్తి కాకుండా ఎలా వెళ్తావ్ బావా.. ఇక్కడ తినొచ్చు కదా అని జ్యోత్స్న అనగా.. కావాలనే తనని ఆపుతుందని అర్థం కావడంతో కార్తీక్.. ఇంటికి వెళ్లి తింటానని అంటాడు. చంటి పిల్లాడిలా మాట్లాడకు బావా.. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. కళ్లముందు మంచి ఫుడ్ ఉంది.. తినొచ్చు కదా? ఏం నీకోసం ఎవరైనా స్పెషల్‌గా ఫుడ్ తీసుకొస్తాననుకుంటున్నావా? ఈ క్షణం నీకోసం ఆలోచించే మనిషిని నేను తప్ప ఎవ్వరు లేరు బావా.. పంతానికి పోయి పస్తులుండొద్దు.. నువ్వు తింటేనే నేను తింటాను.. ఇది పంతం కాదు ప్రేమ అని జ్యోత్స్న అంటుంది. అలాంటి ప్రేమ చూపించడానికి నాకో మనిషి(దీప) ఉందిలే అని కార్తీక్ అంటాడు.
అప్పుడే దీప భోజనం తీసుకొని వస్తుంది. మీకోసం భోజనం తీసుకొచ్చాను మేనేజర్‌గారిని అడిగితే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారని దీప అంటుంది. ఏం కాలేదులే దీపా.. నువ్వు క్యారేజ్ తెస్తావని అనుకోలేదు.. అందుకే చూడగానే సర్ప్రైజ్ అయ్యానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నా.. ఇప్పుడు నీకు ఎలా ఉందంటూ దీప పలకరించగా.. వచ్చి ఇంత సేపు అయినా నీకు ఇది కూడా అడగాలని అనిపించలేదు కదా బావా అని జ్యోత్స్న అంటుంది. దీప మౌనంగా ఉంటుంది. అబ్బా భార్య అంటే నీలా ఉండాలి దీపా అంటూ గుత్తివంకాయ కూర కార్తీక్ తినబోతూ.. జ్యోత్స్నా.. నీకు కూడా కావాలా? గుత్తివంకాయ కూర.. మా ఆవిడ నాకోసం చాలా ప్రేమగా చేసిందని అంటాడు. ఆ ప్రేమ నాకొద్దులే.. నువ్వు తిను అని జ్యోత్స్న అంటుంది. కొన్నింటికి అదృష్టం ఉండాలిలే అంటూ మళ్లీ తినబోతూ.. నువ్వు తిన్నావా దీపా అంటాడు కార్తీక్. లేదనగానే.. తన కుర్చీని పక్కకి జరుపుకొని అన్నం వడ్డిస్తాడు కార్తీక్. దీప కూర ఎంత బాగా చేశావో తెలుసా.. ఇది ఆఫీస్ అయ్యింది కానీ.. అదే ఇంటి దగ్గరైతే నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడ్ని తెలుసా అని జ్యోత్స్నకి మండేలా దీపని కార్తీక్ పొగిడేస్తాడు. ఇక అది తట్టుకోలేక జ్యోత్స్న.. మేనేజర్ ను పిలిచి ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా రానివ్వకని అంటుంది. అయిన సరే దీప, కార్తీక్ తినడం ఆపరు. చక్కగా తిని చేయి కడుక్కుంటాడు కార్తీక్. వెంటనే దీప కొంగుతోనే చేయి మూతి తుడుచుకుని.. పైకిలేస్తాడు. జ్యోత్స్న అలా రగిలిపోతూ నిలబడే ఉంటుంది. నా మీద కోపంతోనే కదా ఆ మేనేజర్‌ని కొట్టావని కార్తీక్ అంటాడు. అది నీ మీద కోపం కాదు బావా అని దీపను చూస్తూ జ్యోత్స్న అంటుంది.
నేను, నా భార్య ఒక్కటే.. నన్ను అన్నా నా భార్యను అన్నా ఒక్కటే. ఇద్దరం వేరు కాదని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప బాక్స్‌లు సర్దుకుంటుంది. నువ్వు ఇంటికి వెళ్లు దీపా.. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను.. బయట వరకూ రానా అని కార్తీక్ అనగానే.. పర్వాలేదు బాబు అని దీప అంటుంది. జాగ్రత్త దీపా అని కార్తీక్ అంటాడు. ఇంకా ఇంకా రగిలిపోతుంది జ్యోత్స్న. దీప అలా వెళ్లగానే.. నా భార్య జోలికి వస్తే మర్యాదగా ఉండదు.. జాగ్రత్త అంటూనే.. వెంటనే స్వరం మార్చి.. భోజనం చేయండి సీఈవోగారు అనేసి కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read