Karthika Deepam2 : సుమిత్రకి నిజం చెప్పనున్న కార్తీక్.. దీప హ్యాపీ!
on Nov 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -507 లో..... దీప వంట చేస్తుంది. అక్కడికి సుమిత్ర వెళ్లి నువ్వు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తున్నావనిపిస్తుంది.. యాక్టింగ్ ఎక్కడ అనిపించడం లేదు.. నా వాళ్లే నేను వెళ్తుంటే చూసి చూడనట్లున్నారు.. అలాంటిది నా కోసం వెతికావు.. ఇంటికి తీసుకొని వెళ్ళావ్.. సేవ చేసావ్.. ఎందుకు ఇదంతా అని సుమిత్ర అడుగుతుంది. నువ్వు నా కన్నతల్లివి అని ఎలా చెప్పాలని దీప అనుకుంటుంది.
నువ్వు అన్నింట్లో నిజాయితీగా ఉన్నావా అని సుమిత్ర అడుగుతుంది. ఎందులో లేను అమ్మ.. నేను ఎప్పుడు నిజాయితీగా ఉన్నానని దీప అంటుంది. ఎందుకని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ కోసమా అని సుమిత్ర అంటుంది. తను ముందు నుండి ఒకేలా ఉంది అత్త.. నీకు త్వరలో ఒక సర్ ప్రైజ్ ఉంది.. అది మేనల్లుడి గిఫ్ట్ అని కార్తీక్ అంటాడు. సుమిత్ర అక్కడ నుండి వెళ్లిపోయాక.. ఏంటి బావ అది అని దీప అడుగుతుంది. నువ్వే తన కూతురని చెప్పేస్తానని కార్తీక్ అంటాడు. దాంతో దీప హ్యాపీగా ఫీల్ అయి కార్తీక్ ని హగ్ చేసుకుంటుంది. మరదలా కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరం హ్యాపీగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని కార్తీక్ వాళ్ళతో కాంచన అంటుంది.
మరొకవైపు నువ్వు మీ అమ్మనాన్నలని కలుపుతానని అన్నావ్ కానీ ఆ కార్తీక్ గాడు కలిపాడని జ్యోత్స్నతో పారిజాతం డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం.. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఉండొచ్చా అని కాంచనతో శ్రీధర్ అడుగుతాడు. అది ఎప్పటికి జరగదు. ఇది మీ ఇల్లే ఎప్పుడైనా రావచ్చు కానీ కార్తీక్ తండ్రిగా మాత్రమేనని శ్రీధర్ తో కాంచన కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



