మేమందరం జబర్దస్త్ వదిలేస్తున్నాం... కొందరు తిట్టారు, కొందరు పొగిడారు!
on Nov 4, 2025
.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ముందుగా అందరూ స్కిట్స్ గురించి చెప్పారు. టీమ్ లీడర్స్ , లేడీస్, లేడీ గెటప్స్, చిన్నపిల్లలు అంతా ఎవరికీ వాళ్ళు గ్రూప్ గా ఏర్పడి స్కిట్స్ చేస్తామని చెప్పారు. అలా ప్రోమో ఫైనల్ లో టీం లీడర్స్ అంతా కలిసి ఒక స్కిట్ వేశారు. ధనరాజ్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి గెటప్ వేసాడు, రాకెట్ రాఘవ అమ్రిష్ పురిగా, రాంప్రసాద్ పుష్పగా, బులెట్ భాస్కర్ ఖైదీలో చిరంజీవి గెటప్ లో, చలాకి చంటి ఐతే మౌత్ ఆర్గాన్ తో నరసింహ మూవీలోని రజనీకాంత్ గెటప్ లో వచ్చాడు, రాకింగ్ రాకేష్ ఐతే అరుంధతి మూవీలోని పశుపతి గెటప్ లో వచ్చాడు.
ఇక వీళ్ళ స్కిట్ ఐపోయాక నార్మల్ గా వచ్చి "అందరికీ నమస్కారం, మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం, కొత్తవాళ్లు వస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరు స్కిట్స్ చేసినా అదే ప్రేమ, అభిమానాలు చూపిస్తారని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పారు. ఈ మాటతో రష్మీ, మానస్, కృష్ణ భగవాన్ షాకయ్యారు. ఇక నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. కొందరు తిట్టారు, కొందరు పొగిడారు. "మీరు వెళ్ళిపోతే మేము జబర్దస్త్ చూడము. జబర్దస్త్ వెంటిలేటర్ మీద ఉంది." అంటున్నారు. ఐతే ఇదంతా ప్రాంక్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇది నిజమా, అబద్దమా తెలియాలంటే షోలో చూడాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



