Illu illalu pillalu : నర్మదపై అత్త సీరియస్.. భార్య చేసిన పనికి కఠినంగా మాట్లాడిన భర్త!
on Jul 18, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -213 లో...... ప్రేమ బాధపడుతుంటే నర్మద వచ్చి మాట్లాడుతుంది. నువు నాతో కూడా చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ కి వెళ్ళావా అని నర్మద అనగానే సారీ అక్క అని ప్రేమ అంటుంది. నాకు చెప్పనవసరం లేదు.. నువ్వు బాధపడకు అని ప్రేమకి సపోర్ట్ గా మాట్లాడుతుంది నర్మద.
మరొకవైపు రామరాజు రైస్ మిల్ లో ఉండగా ధీరజ్, సాగర్, చందు ముగ్గురు వెళ్తారు. రామరాజు దగ్గరికి ధీరజ్ వెళ్లి.. ఇందులో నా తప్పేం లేదు నాన్న, నన్ను క్షమించండి అనీ రిక్వెస్ట్ చేస్తాడు. అయిన రామరాజు కోపంగా ఉంటాడు. దాంతో ధీరజ్ తన అన్నలతో తన బాధని చెప్పుకుంటాడు. ఆ తర్వాత వేదవతి కిచెన్ లో ఉండగా ప్రేమ, నర్మద వచ్చి మాట్లాడించాలని ట్రై చేస్తారు.
మిమ్మల్ని ఎంత నమ్మానే.. ఫ్రెండ్ లాగా ఉన్నాను.. కానీ మీరు నన్నే మోసం చేశారు కదా అని వేదవతి బాధపడుతుంది. అయిన అవమానపడడానికి కారణం నువ్వే అని ప్రేమతో వేదవతి కఠినంగా మాట్లాడుతుంది. ప్రేమకి సపోర్ట్ గా నర్మద మాట్లాడడంతో.. అసలు ప్రేమ బయటకు వెళ్లి అలా డ్యాన్స్ చెప్పేంత దైర్యం లేదు.. నువ్వు సపోర్ట్ చెయ్యడం వల్లే ఇదంతా అని నర్మద పై కోప్పడుతుంది వేదవతి. తరువాయి భాగంలో నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తావో.. నువ్వు నా భర్తవి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తానని ప్రేమ అంటుంది. నువ్వు ఏదో ఫీల్ అవుతున్నట్లున్నావ్ కానీ ఈ రూమ్ లో వస్తువులు ఎలాగో.. నువ్వు అలాగే అంతే తప్ప నీపై ఏం ఫీలింగ్ లేదని ధీరజ్ అనగానే ప్రేమ బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



