Illu illalu pillalu : ట్రైనింగ్ కి వెళ్లిన నర్మద, సాగర్.. కుళ్ళుకుంటున్న శ్రీవల్లి!
on May 17, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -160 లో.....వేదవతి, ప్రేమ, నర్మద ముగ్గురు కలిసి ఇంట్లో ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తారు. అప్పుడే శ్రీవల్లి వచ్చి మీరు ముగ్గురు ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి అని శ్రీవల్లి బాధపడుతుంది. లేదమ్మా.. ప్రేమ ఇంట్లో ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తున్నామని అనగానే.. నేను చెప్పాలా అని శ్రీవల్లి వేదవతి ముందు కూర్చొని వేదవతి చేతులు తన మీద వేసుకుంటుంది. దాంతో మిగతా ఇద్దరు కోడళ్ళు కుళ్ళకుంటారు. ఇంట్లో ఉండి చేసే జాబ్స్ చాలా ఉన్నాయ్ అత్తయ్య అని శ్రీవల్లి చెప్తుంది.
ఇంటి ముందు హోటల్ పెట్టొచ్చు.. వడియాలు పెట్టొచ్చు.. ఇంకా ట్యూషన్ చెప్పొచ్చు అనగానే నర్మద, ప్రేమలకి ఆలోచన వస్తుంది. చాల థాంక్స్ అక్క ట్యూషన్ చెప్పాలని ఐడియా ఇచ్చినందుకు అని ప్రేమ అంటుంది. కానీ ఇద్దరు కలిసి చెప్తే బాగా స్టూడెంట్స్ వస్తారని ప్రేమ అంటుంది. అయినా శ్రీవల్లి చదువుకుంది కదా శ్రీవల్లి అక్క హెల్ప్ చేస్తుందని ప్రేమ, నర్మద అనగానే అడ్డంగా బుక్కయిపోయానని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. చెప్తావా అక్క అని ఇద్దరు చెరొకవైపు అంటుంటే ఇంకేం చెయ్యలేక సరే అంటుంది. ఆ తర్వాత బావ ఎటైనా బయటకు వెళదామని చందుతో శ్రీవల్లి అంటుంది. అది రామరాజు విని అమ్మాయిని తీసుకొని వెళ్ళమని రామరాజు అంటాడు. సినిమాకి తీసుకొని వెళ్ళమని రామరాజు అంటాడు. టికెట్ ధర ఎంత అని రామరాజు అనగానే ఇద్దరికి పన్నెండు వందలు అని శ్రీవల్లి అంటుంది. అన్ని డబ్బులా అని రామరాజు అనగానే మావయ్య గారికి డబ్బు ఖర్చు చెయ్యకూడదు అన్న వీక్ నెస్ ఉందన్న మాట అని అనుకొని మావయ్య డబ్బులు ఎందుకు వేస్ట్ చెయ్యడం.. మేమ్ ఎక్కడికి వెళ్ళమని శ్రీవల్లి అంటుంది. డబ్బు విలువ నీకు బాగా తెలుసమ్మ అని రామరాజు గొప్పగా శ్రీవల్లి గురించి మాట్లాడతాడు.
ఆ తర్వాత నర్మద, సాగర్ హైదరాబాద్ ట్రైనింగ్ కి వెళ్తుంటే రామరాజు వేయి రూపాయలు ఇస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కొంత వేదవతి కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. తరువాయి భాగంలో ప్రేమ, వేదవతి ఇద్దరు నర్మదతో ఫోన్ మాట్లాడుతుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



