Illu illalu pillalu : చందుని కిడ్నాప్ చేసిన విశ్వ.. గదిలో వాళ్ళిద్దరు!
on Apr 15, 2025
స్టార్ మా టీవీలో ప్రసారామవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -132 లో..విశ్వ పంపిన అమ్మాయి శ్రీవల్లికి మేకప్ వెయ్యడానికి వస్తుంది. మరొకవైపు విశ్వ పెళ్లి కి వస్తాడు. అతన్ని చుసిన ధీరజ్ రాకుండా ఆపుతాడు. అప్పుడే వేదవతి చూసి ఎందుకు ఆపుతున్నావ్ రా అని అడుగుతుంది. వాడేదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు అమ్మ అని ధీరజ్ అంటాడు. వాడు నా మేనల్లుడు అని వేదవతి ధీరజ్ ని కంట్రోల్ చేస్తుంది.
విశ్వ వెళ్లి కూర్చుంటాడు. ప్రేమ విశ్వ వంక ప్రేమగా చూస్తుంది. అప్పుడే విశ్వ మేకప్ ఆర్టిస్ట్ కి ఫోన్ చేస్తాడు. తను బయటకు వచ్చి విశ్వని చూస్తుంది. విశ్వ ఏదో ప్లాన్ చెప్తాడు. ఆ తర్వాత పెళ్లి మండపం లోకి అమ్మాయిని తీసుకొని రండీ అనగానే భాగ్యం ఇంకా తన చెల్లి శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు కానీ శ్రీవల్లి గదిలో ఉండదు. అప్పుడే నర్మద, ప్రేమ ఇద్దరు శ్రీవల్లి అక్కని తీసుకొని రమ్మంటున్నారని చెప్తారు. భాగ్యం టెన్షన్ పడుతుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఏసీ పని చెయ్యడం లేదని పక్క గదిలోకి వెళ్ళానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత అబ్బాయిని తీసుకొని రండీ అని అనగానే సాగర్, ధీరజ్, తిరుపతి చందు దగ్గర కి వెళ్తారు కానీ చందు గదిలో ఉండడు ఏదో లెటర్ ఉంటుంది. అది చదివి వాళ్ళు షాక్ అవుతారు.
వెంటనే ఆ విషయం రామరాజుకి వెళ్లికి చెప్తాడు. నర్మద ఆ లెటర్ చదువుతుంది. నాన్న నాకూ ఆ పెళ్లి ఇష్టం లేదని అందులో ఉన్నది చదువుతుంది. దాంతో రామరాజు షాక్ అవుతాడు. నేనంటే ఆయనకు ఇష్టం లేదా అంటూ శ్రీవల్లి ఏడుస్తుంది. తరువాయి భాగంలో చందుని విశ్వ కిడ్నాప్ చేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి మేకప్ ఆర్టిస్ట్ ని తీసుకొని ప్రేమ ధీరజ్ వెళ్తారు కానీ ప్రేమ, ధీరజ్ లని గది లోపల ఉండగానే బయట నుండి డోర్ వేస్తుంది మేకప్ ఆర్టిస్ట్ . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
