Illu illalu pillalu: సీక్రెట్ గా పెళ్ళి చేసుకోవాలనుకున్న కొడుకు.. అక్కడికే వస్తున్న తల్లిదండ్రులు!
on Dec 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -25 లో..... సాగర్, నర్మదల పెళ్లి చెయ్యడానికి గుడికి తీసుకొని వస్తాడు ధీరజ్. వెళ్లేసరికి ధీరజ్ ఫ్రెండ్స్ అంతా సిద్ధం చేస్తారు. లోపలికి వెళ్తుంటే ప్రేమ, కళ్యాణ్ లు కన్పిస్తారు. వాళ్ళని చూసి అది ఇక్కడ ఉందేంటి.. ఇప్పుడు చూస్తే ఊరంతా చెప్తుందనుకొని సాగర్, నర్మదలని కార్ లో కూర్చోమని చెప్పిన ధీరజ్.. ప్రేమ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతు ఫోటోస్ తీస్తాడు. ఈ ఫోటోస్ అందరికి పంపిస్తానని చెప్పగానే ప్రేమ, కళ్యాణ్ లు వద్దని భయపడి అక్కడ నుండి వెళ్తారు.
మరొకవైపు సాగర్, నర్మద లు లోపలికి వస్తుంటే.. నర్మద చెంచలమ్మకి చూడకుండా డాష్ ఇస్తుంది. చూసుకోవాలి కదా అని చెంచలమ్మ అంటుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ లు రెడీ అవ్వడానికి వెళ్తారు. ఆ ధీరజ్ గాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు తెలుసుకోవాలంటూ ప్రేమ గుడి లోపలికి వెళ్తుంటే నాతో మాట్లాడడం కంటే వాడితో గొడవకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని కళ్యాణ్ అనగానే.. ప్రేమ లోపలికి వెళ్లకుండా కళ్యాణ్ తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నర్మద సాగర్ లు రెడీ అయి వస్తారు.
మరొకవైపు రామరాజు వెళ్తుంటే వేదవతి క్యారేజ్ తో రెడీగా ఉంటుంది. మీరు పక్క ఊరి గుడికి వెళ్తున్నారంట నేను వస్తానని వేదవతి అనగానే.. మొదట వద్దన్నా ఆ తర్వాత సరేనని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు పెళ్లి జరుగుతుంటే నర్మద పక్కకి వెళ్లి బాధపడుతుంటుంది. ధీరజ్ వెళ్లి మాట్లాడి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read