రష్యన్ కుక్క కథ చెప్పిన సాయి కిరణ్
on Apr 3, 2024
గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర రోల్ లో చేసే సాయి కిరణ్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. సాయి కిరణ్ సింగర్ మాత్రమే కాదు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి కూడా. ఎప్పుడూ కొత్త కొత్త రీల్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి సాయి కిరణ్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ వింటే గనక నవ్వాపుకోలేరు.. ఎందుకంటే అదో ఫన్నీ స్టోరీ. ఆ కథేంటో తెలుసా " ఒక సారి ఒక రష్యా కుక్క ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యింది. అప్పుడు ఆ ఇండియన్ కుక్కలనీ కలిసి హే బాబు నువ్వెంటి ఇంత బాగున్నావ్...ఎక్కడి నుంచి వచ్చావ్ అని అడిగాయి. నేను రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి వచ్చాను అని చెప్పింది. అదేంటి అక్కడి నుంచి వచ్చావా...అక్కడ అంతా చాలా బాగుంటుంది కదా మరెందుకు వచ్చేసావ్ అని ఇండియన్ కుక్కలు అడిగాయి. మా రష్యాలో తిండి, నీళ్లు, లగ్జరీ అన్నీ చాలా బాగుంటాయి. కానీ మీ భారత దేశంలో ఎలా పడితే అలా మొరిగే స్వాతంత్య్రం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అందుకే భారత దేశానికి వచ్చి సెటిల్ అయ్యాను అని చెప్పింది ఆ రష్యా కుక్క" అంటూ ఒక సెటైరికల్ స్టోరీ వినిపించాడు.
అంటే మన దేశంలో ఉంటూ మన దేశాన్నే చులకనగా మాట్లాడే మేధావి వర్గం గురించి సాయి కిరణ్ ఈ స్టోరీని చెప్పాడు. ఈమధ్య కాలంలో ఇలాంటివాళ్లే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లకు బుద్ది చెప్పడానికి ఎవరినీ నొప్పించకుండా ఇలాంటి స్టోరీ చెప్పి సూపర్ అనిపించుకుంటున్నాడు. ఇక నెటిజన్స్ ఐతే సాయి కిరణ్ చెప్పిన కథకు ఫిదా ఐపోతున్నారు. "కథ కాదు నిజం చెప్పారు, రష్యన్ కుక్క సమాధానం బాగా చెప్పింది సర్" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాయి కిరణ్ బుల్లితెర మీద గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే మంచి కామెడీ రీల్స్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు.
Also Read