Eto Vellipoyindhi Manasu : కోట్ల డీలింగ్ వదిలిపెట్టి మైథిలి కోసం వెళ్లిన సీతాకాంత్...
on Mar 13, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -350 లో..... ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నువ్వు ఇక్కడ ఉండకూడదు.. లండన్ వెళ్ళిపోమని రామలక్ష్మితో ఫణీంద్ర అంటాడు. మిమ్మల్ని ఇలా వదిలేసి.. నేను వెళ్ళలేనని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటాడు. రామలక్ష్మి కూడా సీతాకాంత్ గురించి ఆలోచిస్తుంటుంది
మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి కాఫీ తీసుకొని వచ్చి సందీప్, శ్రీలత కి షేర్ చేస్తుంది. ఒకే కాఫీ సగం సగం చేసుకోవాలా అని శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ రామ్ ని తీసుకొని రెడీ అయి వస్తాడు. ఎక్కడికి అని శ్రీలత అంటుంది. రామ్ వాళ్ళ మిస్ ని కలవడానికి అని సీతాకాంత్ అంటాడు. ఎందుకు నువ్వు పని మానుకొని వెళ్తున్నావని శ్రీలత అడుగుతుంది. నాన్న నన్ను రమ్మని ఒక్కటే గోల అని సీతాకాంత్ చెప్పగానే.. నేనెక్కడ గోల చేశానని రామ్ అంటాడు. అన్నయ్య ఈ రోజు మీటింగ్ ఉందని సందీప్ అంటున్నా వినకుండా సీతాకాంత్ రామ్ ని తీసుకొని వెళ్తాడు. అన్నయ్య ఎందుకు కోట్ల డీలింగ్ ని వదిలి మైథిలి కోసం వెళ్తున్నాడని సందీప్ అంటాడు.ఇక మైథిలి, బావగారు పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతేనని శ్రీవల్లి అంటుంది. అలా జరగనివ్వను.. నా కంట్రోల్ లో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి సీతాకి పెళ్లి చేస్తాను.. అప్పుడు మైథిలి వెంట పడడు అని శ్రీలత అంటుంది.
మరొకవైపు మైథిలి వాళ్ళు భోజనం చేస్తుంటారు. అప్పుడే పనిమనిషి డబ్బు అడుగుతుంది. మొన్నే ఇచ్చాను కదా అని మైథిలి అంటుంది. సరిపోవడం లేదని పనిమనిషి అనగానే ఒక పని చెయ్ రెండు గల్లాలు పెట్టుకో.. ఒకరి సంపాదన అందులో వేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్తుంది. గతంలో సీతాకాంత్ తో అలాగే అన్నది రామలక్ష్మి గుర్తుచేసుకుంటుంది. అదే సమయంలో సీతాకాంత్ రామ్ ని తీసుకొని వచ్చి బయట ఉండి పనిమనిషికి రామలక్ష్మి చెప్పింది వింటాడు. నువ్వు నా రామలక్ష్మివే నాకు తెలుసు ఎలా బయటపెట్టాలని సీతాకాంత్ అనుకుంటాడు. ఇక సీతాకాంత్ ఇంట్లోకి వెళ్ళగానే టిఫిన్ చెయ్యమని ఫణీంద్ర వాళ్ళు అనగానే.. వాళ్ళతో కలిసి టిఫిన్ చేస్తాడు సీతాకాంత్. వెకేషన్ కి లండన్ వెళ్ళాలనుకుంటున్నాం.. మీరు అక్కడే చదివి వచ్చారు కాబట్టి మీకు అన్ని ప్లేస్ లు ఐడియా ఉంటాయని సీతాకాంత్ అనగానే.. మైథిలి ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
