Brahmamudi : రాహుల్ యాక్టింగ్ ని నమ్మేసిన స్వప్న.. లవ్ లెటర్ రాసిన రాజ్!
on Nov 13, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -877 లో.. రాహుల్ ఆఫీస్ లో ఫ్రాడ్ చెయ్యడానికి ఒప్పుకోకపోవడంతో ఎందుకు ఇలా మారిపోయావురా అని రాహుల్ పై రుద్రాణి కోప్పడుతుంది. అదంతా విన్న స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి.. ఇప్పుడే రాహుల్ మంచి వాడిలాగా మారిపోతున్నాడు.. తనని మార్చాలని ట్రై చేస్తే మర్యాదగా ఉండదని రుద్రాణికి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోయాక ఎలా ఉంది మమ్మీ పర్ఫామెన్స్ అని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు.
అంటే నువ్వు ఇదంతా యాక్టింగ్ చేస్తున్నావా అని రుద్రాణి అడుగుతుంది. అవునని రాహుల్ చెప్తాడు. మనం మాట్లాడుకునేది స్వప్న వింటుందని అప్పుడు అలా యాక్ట్ చేసానని చెప్తాడు. నా భార్య ముందు ఇలా చేస్తే నేను మారిపోయానని అనుకుంటుంది.. నాకేం కావాలన్నా తనే చేస్తుంది.. నా గురించి ఆలోచిస్తుందని రాహుల్ అంటాడు. నువ్వు మారిపోయావేమోనని భయపడ్డానని రుద్రాణి అంటుంది. మరొకవైపు శృతితో రాజ్ డిజైన్స్ గురించి మాట్లాడుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీరు నన్ను పట్టించుకోవడం లేదు. ఎప్పుడు మీకు ఆఫీస్ ముఖ్యం అని కావ్య అలుగుతుంది. నేను అంత లిస్ట్ చెప్పాను.. మీరు దాన్ని ఫాలో అవ్వడం లేదని కావ్య అంటుంది. నిన్నే కదే చికెన్ అంటే వండిపెట్టానని రాజ్ అంటాడు.
అయితే ఇప్పుడు నాకు మీరు లవ్ లెటర్ రాయాలని కావ్య చెప్తుంది. దాంతో పేపర్ పట్టుకొని రాజ్ బయటకు వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ సుభాష్, ప్రకాష్ ఇద్దరు లవ్ లెటర్స్ రాస్తుంటారు. మీరెందుకు రాస్తున్నారని రాజ్ అడుగుతాడు. కావ్యకి రాజ్ లవ్ లెటర్ రాస్తున్నాడు.. మీరు మాకు రాయండి అని ఆర్డర్ వేశారని సుభాష్, ప్రకాష్ చెప్తారు. ఆ తర్వాత ముగ్గురు లవ్ లెటర్ రాస్తారు. రాజ్ లెటర్ ని కావ్య చదువుతుంది. అందులో మొత్తం ఆఫీస్, డిజైన్స్, కాంట్రాక్టు అని ఉంటుంది. ఇక సుభాష్ రాసిన దాంట్లో కిచెన్ కి సంబంధించినది ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



