Brahmamudi : రాజ్ మనసులో మాటని కావ్యతో చెప్తాడా.. కూతురి కోసం రంగంలోకి కనకం!
on Jun 14, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -747 లో.....పెళ్లి రాట్ కి యామిని, రాజ్ పూజ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి రాట్ విరిగిపోతుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. ఇలా జరగకూడదు. ఈ పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. అలా ఎందుకు అండి అని పంతులు గారు అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు.
ఆ తర్వాత ఇలా జరుగుతుంది ఏంటని అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. నా కూతురు కి అన్యాయం జరుగుతుందని అంటుంది ఇంతకి ఆ యామిని ఎవరు అంటూ నిలదీస్తుంది. కనకం నువ్వు ఎక్కువ మాట్లాడకు.. ఈ పెళ్లి ఎలాగైనా మనం ఆపాలని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వెళ్తుంది. ఏంటే ఇదంతా అని అడుగుతుంది. కావ్య ఎప్పటిలాగే తనకేం పట్టనట్లు ఉంటుంది.
ఆ తర్వాత కావ్యతో రాజ్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే యామిని అసలు రాజ్ కి ఛాన్స్ ఇవ్వదు. మరొకవైపు పూజకి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు. కనకం, ఇందిరదేవి, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు. మనకి ఆ పంతులు వీక్ పాయింట్ తెలిస్తే ఆటోమెటిక్ గా మనం అనుకున్నది జరుగుతుందని కనకం అంటుంది. తరువాయి భాగంలో కావ్యతో తన మనసులో మాట చెప్పాలని రాజ్ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



