Brahmamudi : నా వల్లే ఆయనకి అలా జరిగింది.. బాధపడుతూ వెళ్ళిన కావ్య!
on May 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-718 లో... రాజ్ తో కావ్య గురించి నెగెటివ్ గా చెప్తుంది యామిని. నువ్వు ఇలా హాస్పిటల్ లో ఉంటే కనీసం నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్న ఆ కళావతి అసలు రాలేదని యామిని అనగానే.. కళావతి గారు అలా చెయ్యరని రాజ్ అంటాడు. ఆ మాటలన్నీ బయట నుండి కావ్య, అప్పు, కళ్యాణ్ వింటారు. తప్పంతా నాదే, ఆయనకి ఎదరుపడి గతం గుర్తువచ్చేలా చేసానని బాధపడుతూ కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది.
మరొకవైపు ఏంటి కావ్య వాళ్ళు ఇంకా రాలేదని ఇందిరాదేవి వాళ్ళు అనుకుంటారు. అప్పుడే కావ్య, అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటి వరకు ఎక్కడకి వెళ్లి వస్తున్నావని కావ్యని అడుగుతుంది రుద్రాణి. దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తున్నావ్ రిసార్ట్ లో ఎవరితోనో తిరిగి వస్తున్నావ్.. అచ్చం రాజ్ లా ఉన్న రామ్ అనే అబ్బాయితో తిరుగుతుందని రుద్రాణి అనగానే.. నా కోడలు గురించి తప్పు గా మాట్లాడితే అసలు ఊరుకోనని రుద్రాణిపై కోప్పడుతుంది అపర్ణ. రాజ్ లా ఉన్న అబ్బాయి రామ్ కాదు ఇద్దరు ఒకటే అదే రాజ్ ఈ విషయం మాకు తెలుసు.. మేమే దగ్గర ఉండి పంపించామని అపర్ణ చెప్పగానే రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. అంటే మీకందరికి తెలిసినా కూడ ఈ విషయం మాకెందుకు చెప్పలేదని రుద్రాణి అంటుంది. ఇలాగే మాట్లాడతావని చెప్పలేదని ఇందిరాదేవి, అపర్ణ అంటుంది.
అక్కడ రాజ్ హాస్పిటల్ లో ఉన్నాడని రుద్రాణి చెప్తుంది. ఏమైందని కావ్యని అడుగుతుంది అపర్ణ. అన్నయ్య గతం గుర్తుచేసుకునే క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు బానే ఉన్నాడని కళ్యాణ్ చెప్తాడు. అసలు నేను ఇలా చేయకుండా ఉండాల్సిందని కావ్య బాధపడుతూ లోపలికి వెళ్తుంది.
ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు కానీ కావ్య లిఫ్ట్ చేయదు. అప్పుడే యామిని వచ్చి రాజ్ తో కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత బావ దారిలోనే వెళ్లి బావని నా వైపు తిప్పుకుంటానని యామిని తన పేరెంట్స్ కి చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చెయ్యదు. అపర్ణ, అప్పు, కళ్యాణ్ కలిసి కావ్య దగ్గరికి వచ్చి.. రాజ్ ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చెయ్ అంటారు.
తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నేను ఎందుకు మీతో మాట్లాడాలని కావ్య అనగానే రాజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



