Immanuel: తిండి లేక మా అమ్మ మట్టి తినేది.. ఇమ్మాన్యుయల్ ఎమోషనల్!
on Nov 15, 2025
.webp)
తల్లి తన కొడుకు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడుతుంది. వాళ్లు తినడానికి తిండి లేకపోయినా కొడుకుని బ్రతికించుకోవడానికి మన్ను(మట్టి) ని కూడా తినేసిన ఓ అమ్మ గతం చెప్తుంటే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. తన తల్లి ఎన్నో బాధలు భరించినది అని చెప్తూ వచ్చాడు ఓ కంటెస్టెంట్. అతను ఎవరో కాదు ఇమ్మాన్యుయల్.
ఈ సీజన్-9 తెలుగు లో సెలెబ్రిటీ కోటాలో అడుగుపెట్టిన కామెడీయన్ ఇమ్మాన్యుయల్.. తన కామెడీతో పాటు ఆటల్లోను నెంబర్ వన్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అతను ప్రతీ గేమ్ లోని తన వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూ ఇప్పటివరకు నామినేషన్లోకి రాకుండా ఉన్నాడు. ప్రతీ వారం బెస్ట్ ఆటతీరుని కనబరుస్తూ నాగార్జున చేత అభినందనలు కూడా పొందుతున్నాడు ఇమ్మాన్యుయల్. అయితే హౌస్ లో ఇప్పటికే తొమ్మిది వారాలు గడిచాయి. ఇందులో రెండు సార్లు ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ముగిసాక హౌస్ లో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ సాగింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. ఒక్కొక్కరి ఫోటోలని చూపిస్తూ తమ జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు.
ఇక ఇమ్మాన్యుయల్ తన బ్రదర్‌తో ఉన్న ఫొటో చూసి ఎమోషనల్ అయ్యాడు. మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు.. ఎందుకంటే అప్పటికే మా అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదంట.. నాన్న వద్దని చెప్పినా మా అమ్మమ్మ పట్టుబట్టి ఉంచుకోమని చెప్పిందంట.. ఎందుకో నీకు పుట్టబోయేది అమ్మాయి కాదు అబ్బాయి అని, తన వల్ల మీ జీవితం మారుంతుందేమోనని మా అమ్మమ్మ చెప్పడంతో మా అమ్మనాన్న ఓకే అనుకున్నారంట.. నేను కడుపులో ఉండగా ఒకానొక సమయంలో తినడానికి తిండి లేక మా అమ్మ మట్టి తినిందంట.. ఇప్పటికీ అది తల్చుకొని మా అమ్మ ఏడుస్తుంది. ఇతను నా మా అన్న అంటు ఆ ఫోటో చూపిస్తూ.. నా చిన్నప్పటి నుంచి మేమిద్దరం కష్టపడ్డాం.. నేనూ, మా అన్న చెయ్యని పని అంటూ లేదు.. వీడు నా లైఫ్‌కి ఒక హీరో.. చిన్నప్పటి నుంచి నన్ను మరో నాన్నలా పెంచాడు.. ఒక ఇరవై మూటలు మోయాలంటే నన్ను ఐదే మోయనిచ్చేవాడు.. వాడు పదిహేను మోసేవాడు అంటూ ఇమ్మాన్యుయల్ ఏడ్చేశాడు.
చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం.. ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను.. కానీ ఏనాడు వాడు నా హెల్ప్ అడుగలేదు.. ఇంటిపక్కన వాళ్లు అంతా మా అన్నని అనేవాళ్ళంటా.. మీ తమ్ముడు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు కదా అతను నీకు హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నప్పుడు.. మా తమ్ముడు అలా కాదంటూ చెప్పాడు. కానీ వాడు ఏదో ఒకరోజు పెద్ద డైరెక్టర్ అవుతాడంటూ ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. కామెడీతో అందరిని నవ్వించే ఇమ్మాన్యుయల్ గతం చూస్తే ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అవ్వాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



