Bigg Boss 9 Telugu: తనూజ వర్సెస్ భరణి.. దివ్య వ్యాలిడ్ నామినేషన్!
on Nov 4, 2025
.webp)
బిగ్ సీజన్-9 లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయల్, భరణి వర్సెస్ తనూజ, దివ్య వర్సెస్ తనూజ. హౌస్ లో తనూజ ఎవరితో అయితే కాస్త క్లోజ్ గా ఉందో వారితోనే ఆర్గుమెంట్స్ కి దిగడం హైలైట్ గా నిలిచింది. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. మొదటి రౌండ్ లో రీతూని సంజన నామినేట్ చేసింది. రెండో రౌండ్ లో సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఇలా రౌండ్ లు జరుగుతున్న కొద్దీ నామినేషన్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.
ఒక రౌండ్ లో బజర్ మోగగానే ముందుగా సేఫ్ జోన్‌లోకి పవన్ వెళ్లాడు. కానీ సంచాలకులుగా ఉండాల్సిన పవన్ బొమ్మ సాయి దగ్గర ఉన్న కారణంగా ఈ రౌండ్‌కి దివ్యనే సంచాలకులని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ముందుగా భరణిని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. మొదటి నుంచి భరణి సేఫ్ ఆడుతున్నాడని.. ఏదో ఒక తప్పు చేసి సారీలు చెప్పడమే పని అంటూ డీమాన్ అన్నాడు. ఇక చివరిగా వచ్చిన సాయి.. తనూజని నామినేట్ చేశాడు. దీంతో భరణి, తనూజ ఇద్దరు వచ్చి తమలో ఎవరు హౌస్‌లో ఉండేదుకు ఎక్కువ అర్హులో చెప్పాల్సి వచ్చింది.
భరణి తను హౌస్ లో ఉండటానికి ఎందుకు డిజర్వ్ అని స్ట్రాంగ్ పాయింట్లు చెప్పాడు. నేను ఈ హౌస్‌లో తనూజకి మూడు టాస్కుల్లో గెలిచేందుకు హెల్ప్ చేశాను.. తనకంటే బాగా టాస్కులు ఆడతాను.. తనలో రేషన్ మేనేజర్‌గా చేసినప్పుడు ఇరిటేట్ అవ్వలేదు.. అందరి చేత నేను చాలా మంచి రేషన్ మేనేజర్ అనిపించుకున్నానంటూ భరణి అన్నాడు. దీనికి తనూజ డిఫెండ్ చేసుకుంది. టాస్క్ విషయంలో ఆయన ఎందుకు సపోర్ట్ చేశారంటే సపోర్టింగ్ గేమ్ కాబట్టి..అయిన ఆయన హౌస్‌లో నుంచి మొదటిగా వెళ్లిపోయింది రిలేషన్స్ వల్ల కానీ తిరిగి హౌస్‌లోకి వచ్చాక కూడా ఆయన అందులోనే ఉండిపోయారని తనూజ అంది.
మొన్న కెప్టెన్సీ టాస్కులో ఎవరికి సపోర్ట్ చేయకుండా ఆయన డైలమాలో ఉండిపోయారు.. అది కరెక్ట్ కాదంటూ తనూజ చెప్పింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య తన పాయింట్లు చెప్పింది. తనూజతో పోలిస్తే భరణి గారి పాయింట్లు రెండు తక్కువ అనిపించాయి. మాటల్లో చెప్పడం వేరు యాక్షన్ లో చేసి చూపించడం వేరు.. ఆయన దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పారు కానీ తను ఎవరికి సపోర్ట్ చేయకుండా నిల్చుండిపోయాడు. టైమ్ అయిపోయింది.. అది కరెక్ట్ కాదంటు పాయింట్లు చెప్పి భరణిని నామినేట్ చేసింది. ఇక నామినేట్ అయిన తర్వాత భరణి ఒంటరిగా కూర్చున్నాడు. ఆ గ్యాప్‌లో తనూజ-దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికెళ్లి.. మీ ఇద్దరూ ఏదైనా మాట్లాడుకుంటే మీ ఇద్దరికి సంబంధించిన టాపిక్ మాట్లాడండి కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు.. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని భరణి అన్నాడు. ఇక భరణి, తనూజ మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ వారి మధ్య బంధాన్ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ మొదట్లో ఉన్నట్టుగా కలిసి ఉంటారో ఉండరో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



