Tanuja Gowda : పదో వారం హౌస్ కెప్టెన్ గా తనూజ.. పట్టాభిషేకం కూడానా!
on Nov 15, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం బీబీ రాజ్యం టాస్క్ జరిగింది. ఇక ఈ టాస్క్ లో చివరగా నిఖిల్, రీతూ , తనూజ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా ఇందులో తనూజ గెలిచింది. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
హోల్డ్ ది క్రౌన్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్కులో తమ ఫొటోకి పెట్టిన కిరీటాన్ని కత్తితో కిందపడకుండా ఎక్కువసేపు ఉంచాలి. ఎవరు చివరి వరకూ ఉంటే వాళ్లు విన్ అయి బీబీ రాజ్యానికి మహారాజు లేదా మహారాణి అవుతారు. అలానే కొత్త కెప్టెన్ అయి ఇమ్యూనిటీ పొందుతారని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. టాస్కులో ముందుగా రీతూ ఔట్ అయింది. తర్వాత నిఖిల్-తనూజ మధ్య పోటీ జరుగుతుండగా సంజనకి సంఛాలక్ సుమన్ శెట్టి ఎవరో ఒకరి కత్తికి యాపిల్ వేలాడదీసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడే సంజన.. తనూజకి కాకుండా నిఖిల్ కత్తికి యాపిల్ పెట్టింది. దీంతో నిఖిల్ ఔట్ అయి తనూజ విన్ అయిపోయింది. తనూజ గెలవగానే భరణి వచ్చి పైకి ఎత్తి తెగ సంబరపడిపోయాడు. బిగ్‌బాస్ అయితే స్పెషల్‌గా ఒక లెటర్ పంపించి తనూజని పొగుడుతూ సింహాసనం తెప్పించి కిరీటం పెట్టించి పట్టాభిషేకం కూడా చేయించారు. హమ్మయ్యా ఫైనల్లీ.. ఇక నేను ప్రశాంతంగా పడుకుంటానంటూ తనూజ అంది.
ఇక తనూజ కల నెలవేరింది. కెప్టెన్సీ పగ్గాలు చేజిక్కించుకుంది.. ఇంకేముంది విన్నర్ ఒక్కటేగా.. ఆ కప్ కూడా ఇచ్చేయండి సర్ అంటు ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే తనూజకి ఓటింగ్ పరంగా పెద్ద పోటీ ఉండేలా కనిపించడం లేదు. అందులోనూ స్టార్ మా, బిగ్‌బాస్ టీమ్, హోస్ట్ నాగార్జున అందరూ తనూజని పొగడటమే సరిపోతుంది. మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో అయితే తనూజని ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారా అంటూ నాగార్జున అనడమే దీనికి నిదర్శనం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



