అఖిల్ సార్థక్ కి సర్‌ప్రైజ్ చేసిన మోనాల్
on Nov 4, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్ 4 అంటే చాలు ముందు గుర్తొచ్చేది అఖిల్ సార్థక్, మోనాల్ గుజ్జర్. ఈ బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ దూరమైపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు అఖిల్ సార్థక్ తో కలిసి వాళ్ళ సలోన్ కి వచ్చింది. అలాగే లైవ్ లోకి వచ్చింది. కాసేపు ఫాన్స్ తో మాట్లాడారు. అల్లరి నరేష్ నటించిన "సుడిగాడు" అనే మూవీతో మోనాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ చేసింది. ఇక తర్వాత ఆమె గుజరాత్ వెళ్ళిపోయి అక్కడ గుజరాతి మూవీస్ లో నటిస్తోంది. ఇక అఖిల్ కి కూడా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ వీడియోని, పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "చాలా ధన్యవాదాలు, సర్‌ప్రైజ్‌చేసినందుకు...కొంతకాలంగా నేను చాలా నిరుత్సాహంగా ఉంటున్నాను.
ఇప్పుడు నువ్వు ఇలా రావడం నిజంగా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూడటం నా మనసుకు సంతోషంగా అనిపిస్తోంది. నీ రాకతో నేను షాక్ అయ్యాను...నిన్ను చూసేసరికి నా నోట మాట రాలేదు..ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ మనం ఫ్రెండ్స్" అంటూ కొన్ని లైన్స్ ని పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "మీ ఇద్దరి కోసం ఈ బిగ్ బాస్ సీజన్ చూసాను. ఈ కాంబోని చాలా రోజులు మిస్సయ్యాం. ఓజి పెయిర్, ఎన్ని బిబి జోడీస్ వచ్చినా మీరు ఇద్దరు చాలా స్పెషల్ అంతే..మిమ్మల్ని ఇలా కలిపి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడడం బాగుంది. సోహైల్ కూడా ఉంటే బాగుండేది." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



