సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?
on Oct 21, 2021
'సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?' అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో హోస్ట్ సీట్లో కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అందుకో కారణం ఉంది. అదేమిటంటే... ఓ ప్రశ్నకు కంటెస్టెంట్‌కే కాదు, తారక్‌కు కూడా ఆన్సర్ తెలియలేదు.
అయితే, హాట్ సీటులో కూర్చున్న వ్యక్తి కుమార్తె కూడా ఆ షోకు వచ్చింది. ఆ చిన్నారికి ఆన్సర్ తెలిసింది. 'గుర్రం జాషువా' అని చెప్పింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మనకి సిగ్గుండాలని చెప్పారు. చిన్నారి స్కూల్ టీచర్ రాజ్యలక్ష్మిగారిని కూడా తారక్ అభినందించారు. అయితే, ఆ ప్రశ్న ఏంటనేది తెలియడానికి షో చూడాలి.
తారక్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో తనకు క్లాసికల్ డాన్స్ నేర్పించినది సుధాకర్ అని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారని చెప్పారు. ఈమధ్య పెద్దగా కలవలేదని తెలిపారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
