శ్రీముఖిని ఎత్తలేక చతికిలపడ్డ షకలక శంకర్!
on Oct 8, 2021
యాంకర్, యాక్ట్సెస్ శ్రీముఖి ముద్దుగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే... భారీ పర్సనాలిటీ. రెగ్యులర్‌గా యాంకర్లు, హీరోయిన్లు మెయిన్టైన్ చేసే వెయిట్ కంటే శ్రీముఖి వెయిట్ ఎక్కువే. అయినా అందంగా ఉంటుంది. చక్కగా యాంకరింగ్, యాక్టింగ్ చేస్తుంది. అందుకని, ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి వెయిట్ ఎంతనేది అంచనా వెయ్యకుండా ఎత్తుకోవాలని ‘షకలక’ శంకర్ ట్రై చేశాడు. అయితే, అతడి వల్ల కాలేదు. దాంతో అతడే కింద పడ్డాడు. ఆదివారం జీ తెలుగులో టెలికాస్ట్ కానున్న ‘దసరా దోస్తీ’లో నవ్వించే ఈ సంఘటన చోటు చేసుకుంది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ విజయదశమికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కోసం ‘షకలక’ శంకర్‌తో కలిసి ‘దసరా దోస్తీ’కి వచ్చాడు. శ్రీముఖిని ఎత్తుకోవడానికి విఫల యత్నం చేశాక... ‘ఈ బొప్పాయి మామూలు బొప్పాయి కాదు అల్లుడు’ అని ‘షకలక’ శంకర్ డైలాగ్ చెప్పాడు.
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ కూడా ‘దసరా దోస్తీ’లో సందడి చేశాడు. అతడితో స్టెప్పులేసిన భానుశ్రీ.. శ్రీముఖిని ఆటపట్టించే ప్రయత్నం చేసింది. దాంతో ‘నాలోని సేతుపతిని నిద్రలేపకు’ అని శ్రీముఖి అంటే... ‘మీరు మీరు గొడవపడి సేతుపతి అంటే నా దగ్గరకు వస్తుందండీ’ అని వైష్ణవ్ అన్నాడు. మొత్తం మీద ‘ఉప్పెన’ ప్రస్తావన వస్తే... క్లైమాక్స్ టాపిక్ ఎక్కడ వస్తుందోనని అవాయిడ్ చేస్తున్నట్టు ఉన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
