విజయ్ దేవరకొండతో లిప్ కిస్ సీన్ కైనా రెడీ...చిరంజీవిని రిజెక్ట్ చేయడమేంటి ?
on Nov 16, 2025

పెళ్ళాం ఊరెళితే మూవీలో శ్రీకాంత్ తో నటించిన జ్యోతి రోల్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఆ మూవీలో జ్యోతి కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఐతే ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి, విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నేను అందరివాడు మూవీ చేశా. నాకు మేనేజర్ కాల్ చేసి ఏమన్నాడంటే జ్యోతి గారు చిరంజీవి గారి సినిమాలో ఒక రోల్ ఉంది అన్నాడు. ఆయన సినిమా అనేసరికి నేను వెళ్లిపోయాను. ఒకే ఒక్క సీన్ ఉంది అన్నారు. నేను డెఫినెట్ గా చేస్తాను అని చెప్పా. నాకు సెకండ్ థాట్ కూడా లేకుండా అసలు క్యారెక్టర్ ఏంటో కూడా అడగకుండా చేసేస్తాను అని చెప్పాను. నేను అక్కడికి వెళ్లేసరికి చిరంజీవి గారి పెళ్లి చూపులు సీన్ జరుగుతోంది. చిరంజీవి గారిని నేను రిజెక్ట్ చేసి ఎవరో బండోడిని చేసుకున్నానట..ఆ సీన్ చేసేసి ఇంటికొచ్చి అద్దం ముందు నిలబడి నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేయడమేంటి..చక్కగా చిరు గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. సీన్ చేస్తున్న ప్రతీ సెకను నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసి బండోడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడమేందిరా బాబు అనిపించింది. ఇక ఇప్పుడున్న జనరేషన్ లో విజయ్ దేవరకొండతో నటిచాలని ఉంది. అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఆయనంటే నాకు ఇష్టం. ఒక రొమాంటిక్ మూవీ చేయాలనుంది. సీన్, మూవీ డిమాండ్ చేస్తే లిప్ కిస్ సీన్ కి ఐనా రెడీ నేను" అని చెప్పింది జ్యోతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



