Brahmamudi : ఆమెను పెళ్ళికి ఎందుకు పిలిచావ్.. యామినిపై వైదేహీ సీరియస్!
on Jun 11, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -744 లో..... రాజ్ పెళ్లికి రెడీ అయిన విషయం కావ్యకి చెప్పడానికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి కావ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఏం పట్టనట్లు అలా ఎలా ఉంటున్నావేంటని ఇందిరాదేవి అంటుంది. కిచెన్ లో ఇంకొక ఐస్ క్రీమ్ ఉందంటూ కావ్య వెళ్తుంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి వైదేహి, యామిని వచ్చి డ్రెస్ చూపించి సెలక్ట్ చేసుకోమని చెప్తారు. కాసేపటికి కావ్యకి యామిని ఫోన్ చేసి.. ఎల్లుండి నాకు రాజ్ కి పెళ్లి అని చెప్తుంది. నాకు బయపడి చాటుగా పెళ్లి చేసుకుంటున్నావా అని కావ్య అనగానే నీకు భయపడడమేంటి అందరి ముందు గ్రాంఢ్ గా పెళ్లి చేసుకుంటానని యామిని అంటుంది. ఆ తర్వాత స్వప్న నగలన్ని ప్యాక్ చేస్తుంటే రాహుల్ వస్తాడు.
ఇప్పుడు నగలు ఎందుకు ఇలా చేస్తున్నావని రాహుల్ అడుగగా బ్యాంకు లో పెట్టడానికి అని స్వప్న అంటుంది. ఇప్పుడు బ్యాంకులో పెడితే ఇవి గిల్టీ నగలు అని తెలిసి పోతుందని రాహుల్ అనుకుంటాడు. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయ్ కదా ఎందుకు ఇప్పుడు బ్యాంకు లో అని రాహుల్ అనగానే అవును కదా అని స్వప్న అంటుంది. మరుసటిరోజు యామిని, వైదేహి వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని కావ్య ఇంటికి వస్తారు. అందరూ పెళ్లికి రండీ అని యామిని అనగానే అందరం వస్తామని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు కావ్యని ఎందుకు పిలిచావని యామినిపై వైదేహీ కోప్పడుతుంది. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వెళ్ళబోతుంటే కావ్య వాల్లే పెళ్లి కి వస్తారు. వాళ్ళని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
