
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఏ చిన్న మూమెంట్ ఇచ్చినా, ఏ దర్శకుడితో మాట్లాడినా అది సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండింగ్‌గా మారిపోతుంది. తాజాగా బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar)తో ప్రభాస్ సీక్రెట్ మీటింగ్ జరిగిందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒకింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అసలు వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందా, ఆ మీటింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు ఆదిత్య ధర్ ఇటీవల రెబెల్ స్టార్ ప్రభాస్‌ను పర్సనల్‌గా కలిశారనే ప్రచారంలో నిజం ఉంది. వీరిద్దరి మధ్య రాబోయే ఒక భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. ఈ మీటింగ్ సందర్భంగా ఆదిత్య ధర్ తన మనసులో ఉన్న ఒక పవర్‌ఫుల్ పాయింట్‌ను, ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయే కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ను ఆయన ముందు ఉంచారు. అయితే, ఆదిత్య ధర్ చెప్పిన ఆ లైన్‌తో ప్రభాస్ ఇమ్మీడియట్‌గా కనెక్ట్ కాలేకపోయారని, అందువల్లే ఆ చర్చలు ఎలాంటి ఒక ఖచ్చితమైన ముగింపు లేదా అధికారిక నిర్ణయం లేకుండానే ముగిశాయని ఇండస్ట్రీ టాక్.
ఆదిత్య ధర్ గతంలో 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్', రీసెంట్ గా 'ధురంధర్', 'ధురంధర్ 2' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్న పవర్‌ఫుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో హై-వోల్టేజ్ యాక్షన్ మరియు ఇంటెన్స్ ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' తరహాలో ఓవర్ డోస్ వైలెన్స్, కరుడుగట్టిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే ఒక భీభత్సమైన వైలెంట్ క్యారెక్టర్‌లో ప్రభాస్‌ను చూడవచ్చని అభిమానులు ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఈ మీటింగ్ వార్త వినడమే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సెలబ్రేషన్ లాంటి న్యూస్‌గా మారింది.
కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు నాగ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD - పార్ట్ 2' కూడా మొదలైంది. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' లైన్ లో ఉంది.
ఈ నాలుగు భారీ చిత్రాలను పూర్తి చేయాలంటే కనీసం 2 సంవత్సరాల పైనే సమయం పడుతుంది. ఈ లోపు దర్శకుడు ఆదిత్య ధర్ కూడా ఒక సినిమా చేసే అవకాశముంది. ఆ తర్వాత ఆదిత్య ధర్ రెడీ చేసిన స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.





