
అమ్మపై జగన్ అభిప్రాయం..
సామాన్యుడైనా..ప్రముఖుడైనా ఎవరికైనా అమ్మ అమ్మే. మదర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ అమ్మకు పాదాభివందనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికి శుభాకాంక్షలు తెలిపారు. "దేవుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టే, ఆయన అమ్మను సృష్టించాడు'' అంటూ ట్వీట్ చేశారు.
May 08, 2016.png)
నా మాటంటే మాటే! నన్నెదిరించే వారెవ్వరూ...
జడ్జీలు డబ్బులు తీసుకుని తీర్పులు ఇస్తున్నారంటూ న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై అటు సుప్రీంకోర్టులోను, ఇటు హైకోర్టులోను కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అయితే` మీడియానే తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. ఒకవేళ అదే తప్పయితే ఒక్కసారి కాదు, వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం గమనార్హం. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆమెపై కోర్టు ధిక్కరణ చర్య తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది బికాష్ భట్టాచార్య మౌఖికంగా చేసిన అభ్యర్ధనను కోలకతా హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయనేతలకు ముందు వ్యాఖ్యలు చేయడం ఆపైన లేదు నేను అలా అనలేదు అదంతా వక్రీకరించారు అనడం పరిపాటైపోయింది. అయితే ఇక్కడ మమతాబెనర్జీ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అదే తప్పయితే వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం ఫైర్‌బ్రాండ్ అన్న పేరును సార్ధకం చేసుకున్నా, ఎన్నో ఉన్నత పదవుల్లో కొనసాగి, నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఓ పార్టీకి అధినేతగా కొనసాగుతూ ఎంతో అనుభవం ఉండి, ఆచితూచి మాట్లాడుతూ, పరిపాలన చేయవలసిన ఓ నేతే అలా మాట్లాడారని చెబుతుంటే ఇక సామాన్యులకు ఆయా వ్యవస్థలపై నమ్మకం పోతుంది. అంతేకాదు భవిష్యత్‌లో ఆయా నేతలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎంతగా ‘నేనంటే నేనే... నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరు...’ అంటూ ఓ సినీగీతంలా ఈ మాటలు అన్నా భవిష్యత్‌లో ఇటువంటి మాటలే ఆమె పాలనపై, ఆమెపై వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం!
Aug 17, 2012
కిరణ్ ను కలవరపెట్టిన జగన్ తో అసదుద్దీన్ భేటీ
ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు 2012 ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయభేరి రాష్ట్రంలో చర్నోపచర్చలకు దారితీశాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ తరుణంలో ఎం.ఐ.ఎం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెంచల్ గూడ జైలుకు వెళ్ళి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కలిశారు. జైలు అధికారుల నుంచి ములాఖాత్ అనుమతి పొందిన ఆయన జగన్ తో గంటసేపు గడిపారు. అప్పుడు జగన్ ఆరోగ్యపరిస్థితి, జైలువాతావరణం, సిబీఐ విచారణ తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయపరిణామాల గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చ నడిచింది. ఈ చర్చ రాజకీయసమీకరణల్లో ఏమైనా కొత్త అంకానికి తెరలేస్తుందన్న సందేహానికి తావిచ్చింది. భవిష్యత్తులో బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న ఎం.ఐ.ఎం., రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా ఎప్పుడైనా ఒప్పందం చేసుకోవటానికి ఈ సమయాన్ని జగన్, అసదుద్దీన్ ఉపయోగించుకోవచ్చనే కొత్త ఊహలకు ఆస్కారమేర్పడింది. అయితే ఈ ఊహలేమీ నిజం కాదన్నట్లు అసదుద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వమని జగన్ ను కోరానన్నారు. అయితే అసదుద్దీన్ 2014 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేందుకు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అయితే ఊహించని పరిణామాలు ఏమైనా జరిగితే తమను నినదించవద్దని ఆయన కోరారు. అంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఎం.ఐ.ఎం. జగన్ ను అసదుద్దీన్ కలిశాక మద్దతు ఉపసంహరించుకునే ఆలోచన కూడా చేయొచ్చని ఆ మాటలో గూఢార్థం బయటపడుతోంది, కాంగ్రెస్ బలం తగ్గితే తనవైపు చూస్తుందని జగన్ భావించి ఉండవచ్చని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా కొత్తబంధానికి తెరలేపేందుకు అసదుద్దీన్, జగన్ మిలాఖాట్ జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అదెంతవరకూ నిజమో తెరపైనే చూడాలి.
Jun 20, 2012
బాబు, కిరణ్ కు సవాల్ గా మారిన తిరుపతి ఎన్నికలు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు. స్ పట్టున్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా తిరుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తితో సహా పలువురు నేతలు ప్రచారం చేసేశారు. కొన్ని సంఘాల పేరిట ముద్రించిన కరపత్రాలను తమ ప్రచారంలో భాగంగా పంచిపెట్టారు. వీరి ప్రచారశైలిని గమనించిన తన తరుపున ప్రచారం చేసేవారికి ఒక గ్రూపుగానూ, తాను ఒక గ్రూపుగానూ చీలిపోయి ప్రచారం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వెంకటరమణ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రచారం చేసిన 15 నిమిషాల తరువాత కాంగ్రెస్ ప్రచారం అదే ప్రాంతంలో జరిగేలా ఆయన ఏర్పాటు చేశారు. అంటే టిడిపిపై ఒక గ్రూపు కన్నేసి అనుసరించేలా వెంకటరమణ ఏర్పాట్లు చేయటం నేతలనూ ఇంకేమీ చేయొచ్చో అన్న ఆలోచనలకు పురిగొల్పింది. దీంతో సిఎం ఢిల్లీ నుంచి ఏ నేత వచ్చినా వదలకుండా ముందు తిరుపతి తీసుకువచ్చేస్తున్నారు. వాయలార్ రవి తరువాత గులాంనబీఆజాద్ కూడా రాగానే మొదట ఈ నియోజకవర్గం నుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రముఖ నేతలతో పాటు తిరుగుతూనే వెంకటరమణ తనకు సహాయం చేస్తామన్న నేతలనూ మధ్యమధ్యలో పలకరిస్తున్నారు. ఇటు ఓటు అభ్యర్థిస్తూనే అటు సెల్ లో వారి సహకారం ఏ రూపంలో అందుతోందో కనుగొంటున్నారు. మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి రఘువీరారెడ్డిలతో పాటు ఇప్పటిదాకా అలిగిన గల్లా అరుణకుమారి తదితరులను కలుపుకోవటంలో వెంకటరమణ విజయం సాధించారు. ఐక్యతతో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తరువాత వ్యూహం ఎవరకీ అర్థం కాకుండా సిఎం తీసుకున్న జాగ్రత్తలను అనుసరిస్తూనే అభ్యర్థి వెంకటరమణ ఇతర పార్టీల వ్యూహాలను కిరణ్ కు తెలియజేస్తున్నారు. తాజా సమాచారాలు అందటంతో సిఎం కూడా ఎప్పటికప్పుడు తాము చేసే కార్యక్రమాలను ఎలా మార్చుకోవాలో వెంకటరమణకు సూచనలు ఇస్తున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ శంకరరెడ్డి ఓటుబ్యాంకుపై, టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఓటుబ్యాంకు పై దృష్టి సారించిన సిఎం తన సోదరుడి ద్వారా వీరిద్దరి కార్యక్రమాలను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కడప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ఆగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ ఉత్సాహాన్ని ఎలా దెబ్బతీయాలో తమ కార్యకర్తలకు సూచిస్తూనే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జా గోపాలకృష్ణలు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు బాబు నిర్దేశిస్తున్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ తదితరులు చేసిన ప్రచారం వల్ల ఉండే ప్రయోజనాలను సమీక్షిస్తూనే అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని కొత్తతరహాలో ఆలోచనలు చేయమని బాబు ప్రోత్సహిస్తున్నారట. ఇలా వ్యూహప్రతివ్యూహల్లో ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఐక్యతను చెదరగొట్టేందుకు తెలుగుదేశం వేసిన ఎత్తుగడలు ఇప్పటిదాకా ఫలించలేదు. కానీ, బాబు రాజకీయ అనుభవంతో చేసే ప్రతీ పని ఫలితమిస్తుందని, ఎన్నికలు దగ్గరయ్యేటప్పటికి వాతావరణం తమకు అనుకూలమవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Jun 07, 2012.jpg)
జ్యోతిరూపంలో దర్శనమిచ్చిన అయ్యప్పస్వామి
కేరళ :శబరిమల యాత్ర చివరి రోజున పొన్నాంబళంమేడు కొండల్లో అయ్యప్పస్వామి ౩ సార్లు మకర జ్యోతి రూపంలోదర్శనంతో భక్తులు పులకించిపొయారు.జ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు.పోలీసులు,వైద్యశాఖ, ఆగ్నిమాపక విభాగం పులిమేడులో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. పంచలిమేడు,పరుంతుపరల నుంచి కూడా మకర జ్యోతిని స్పష్టంగా చూడగలిగారు.
Jan 15, 2012(1).jpg)
18 థియేటర్లలో యన్ టి ఆర్ "శక్తి" ప్రివ్యూ
18 థియేటర్లలో యన్ టి ఆర్ "శక్తి" ప్రివ్యూ వేస్తున్నారట. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మించిన చిత్రం "శక్తి". ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని మొత్తం పద్దెనిమిది థియేటర్లలో ప్రీమియర్ షో వేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. అదికూడా ముంబయ్, పూనె, చెన్నైలలో ఈ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారట. వేరే రాష్ట్రాల్లోనే పద్దెనిమిది థియేటర్లలో ప్రివ్యూ షో వేస్తున్నారే కానీ, హైదరాబాద్ లో మాత్రం ఈ యన్ టి ఆర్ "శక్తి" ప్రివ్యూ వేస్తున్న లక్షణాలు ఇంతవరకూ కనపడలేదు. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం మీద భారీ అంచనాలు అటు యన్ టి ఆర్ అభిమానుల్లోనూ, ఇటు సినీ జనం లోనూ భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి 45 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చయిందని సమాచారం. "మగధీర" చిత్రం ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి స్ఫూర్తి అని ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ అన్నారట. ఏప్రెల్ ఒకటవ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం అష్టాదశ శక్తిపీఠాలకు సమబంధించిన కథతో నిర్మించబడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
Mar 31, 2011
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



