Home

»

Latest News

Trisha: సూర్యకు కూడా త్రిష లక్కీ చార్మ్ అవుతుందా?

May 05, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) జంటగా నటించిన 'కరుప్పు' (Karuppu) మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. కంటెంట్ పరంగా యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ మే 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. వేసవి కానుకగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం. సూర్య తనదైన శైలిలో వైవిధ్యమైన గెటప్‌లో కనిపించనుండగా, చాలా కాలం తర్వాత సూర్య-త్రిష జోడీని స్క్రీన్‌పై చూడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సూర్య బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ అందుకొని చాలా కాలమైంది. ఇప్పుడు 'కరుప్పు'తో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం తమిళనాట త్రిషను లక్కీ చార్మ్ గా భావిస్తున్నారు. మరి త్రిషతో లక్ కలిసొచ్చి సూర్య కూడా హిట్ కొడతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com