Home

»

Latest News

Vishwambhara: రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు 

May 11, 2026

 


మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ విశ్వంభర. బహుశా చాలా సార్లు విశ్వంభర థియేటర్స్ లో మెగా చరిష్మాకి డాన్స్ చేస్తున్నట్టుగా కలలు కూడా కంటు ఉంటారు. పోనీ మూవీ లేట్ అయితే లేట్ అయ్యింది. కనీసం అప్ డేట్స్ అయినా వస్తు ఉంటే  బాగుండు అనుకునే  ఫ్యాన్స్ కూడా లెక్కలేని మంది. ఇప్పుడు వాళ్లందరిలో జోష్ తెచ్చేలా ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. పైగా సదరు న్యూస్ ఎప్పట్నుంచో ఉన్న డౌట్స్ కి  ఫుల్ స్టాప్ పెట్టింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం 


విశ్వంభరని రెండు భాగాలుగా రీలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.షూటింగ్ సాగుతున్న కొద్దీ కథలో ఉన్న డెప్త్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) స్కోప్ పెరిగినట్లు తెలుస్తోంది. విశ్వంభరలో చూపించబోయే ఫాంటసీ ప్రపంచం, అందులోని విభిన్న లోకాలు మరియు మెగాస్టార్ పాత్రలోని షేడ్స్‌ను ఒకే భాగంలో చూపించడం కష్టమని దర్శకుడు వశిష్ట భావిస్తున్నారని అందుకే టూ పార్ట్స్ గా రానుందనే న్యూస్ చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతూ వస్తుంది. దీంతో ఈ విషయంపై తాజాగా వశిష్ట స్పందిస్తు రెండు భాగాలుగా రావడం లేదు. అలాంటి  రూమర్స్ ని నమ్మకండి. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. విఎఫ్ఎక్స్ వలన లేటు అవుతూ వస్తుంది. చిరంజీవి గారు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చాడు.


Also read: Manasa Varanasi vs Mamitha bhaiju: ఎంత పని జరిగిపోయింది.. ఒకరి ప్లేస్ లో మరొకరు!

విశ్వంభరని  యూవీ క్రియేషన్స్ దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో  నిర్మిస్తుండగా   సుమారు 13 భారీ సెట్స్  హాలీవుడ్ స్థాయి విజువల్స్  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి . త్రిష హీరోయిన్ కాగా ఆషికా రంగనాధ్ తో పాటు మరికొంత మంది భామలు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా హనుమాన్ ఫేమ్ గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 

  
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com