Home

»

Latest News

chiranjeevi: విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్!  ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Jun 25, 2026 3:06PM

 

 
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'విశ్వంభర'( మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా   అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ గ్రాండ్ విజువల్ వండర్‌ విడుదల ఎప్పుడు అనే విషయంపై ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఎవరికీ ఒక స్పష్టమైన క్లారిటీ లేనప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా తగ్గకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తోంది. సినిమాలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను గౌర హరి పంచుకోనున్నారని, కీరవాణితో కలిసి ఆయన వర్క్ చేయడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

సంగీతంతో పాటు సినిమాకు అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ (VFX) విభాగంలో కూడా ఒక స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు ఒక సంచలన వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించిన  నాగ్ అశ్విన్  విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులని పర్వవేక్షిస్తున్నట్టుగా  తెలుస్తుంది. గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో మేకర్స్ అలర్ట్ అయ్యి వేరే గ్రాఫిక్స్ కంపెనీలను సంప్రదించినా అవుట్‌పుట్ సంతృప్తికరంగా రాలేదు. ఈ క్రమంలోనే విజువల్స్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి, ట్రోలింగ్ బారి నుండి సినిమాను కాపాడటానికి నాగ్ అశ్విన్ సహాయం కోరినట్లు తెలుస్తోంది.  

సినిమా అవుట్‌పుట్ మరింత నాణ్యంగా రావడం కోసం నాగ్ అశ్విన్ తన వంతు సలహాలు, సూచనలు ఇస్తూ గ్రాఫిక్స్ టీమ్‌ను గైడ్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ ప్రాజెక్టులో నాగ్ అశ్విన్ పాత్ర కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కానుంది. ఆగస్టు ఎండింగ్ నాటికి విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులన్నింటినీ కంప్లీట్ చేయాలని నాగ్ అశ్విన్ ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన సెప్టెంబర్ నుండి తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కల్కి 2 మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

చిరంజీవి సరసన టాలెంటెడ్ బ్యూటీస్ త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ విఎఫ్ఎక్స్ పనులను శరవేగంగా పూర్తి చేసి, ఎలాగైనా రాబోయే విజయదశమి (దసరా) పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 45 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్ ఫుటేజ్‌ను చిరంజీవి స్వయంగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చినా, మిగిలిన భాగం మరింత పర్ఫెక్ట్‌గా రావడం కోసం నాగ్ అశ్విన్ బృందం రంగంలోకి దిగడం విశేషం. బింబిసార ఫేమ్ వశిష్ట(Vasishta) దర్శకుడు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com