Home

»

Latest News

హోం మినిస్టర్‌కే వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి.. లేడీ అమితాబ్ మాస్ గర్జన!

Apr 17, 2026

టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్యాయాలను ఎదిరించే పవర్‌ఫుల్ పాత్రల్లో ఆమె నటన అద్వితీయం.  విజయశాంతి నటించిన ఆశయం సినిమాలోని అసెంబ్లీ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అధికార గర్వంతో విర్రవీగే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సాగే ఈ సీన్ చూస్తుంటే, ఆమెను ఎందుకు 'లేడీ అమితాబ్' అంటారో మరోసారి అర్థమవుతుంది.

ఈ వైరల్ వీడియోలో విజయశాంతి హోం మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి దుర్మార్గాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన వారే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడితే, ఆ వ్యవస్థను ఎలా ప్రశ్నించాలో ఈ సీన్‌లో అద్భుతంగా చూపించారు. "హోం మినిస్టరే నా శీలాన్ని దోచుకుంటే.. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ అకృత్యానికి సెల్యూట్ కొట్టి కాపలా కాస్తుంటే.. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి?" అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

రాజకీయ బలంతో సామాన్యులను అణచివేసే నాయకుల నిజస్వరూపాన్ని బయటపెట్టడమే కాకుండా, తనపై జరిగిన వ్యక్తిగత దాడులను కూడా ఆమె దీటుగా ఎదుర్కొన్నారు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూసిన ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు ఆమె ఇచ్చిన స్వేచ్ఛ, "ఎవరు తప్పు చేసినా.. ఆఖరికి నేను లేదా ముఖ్యమంత్రి అయినా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను" అన్న డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్‌లో ఉంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయశాంతి పర్‌ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి సినిమాల్లో అలాంటి గంభీరమైన పాత్రలు, పదునైన డైలాగులు కరువయ్యాయని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. విజయశాంతి వంటి పవర్‌ఫుల్ హీరోయిన్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com