
ఇళయ దళపతి విజయ్(Vijay)అండ్ సమంత(samantha).. ఈ ఇద్దరు కలిసి గతంలో కొన్ని చిత్రాల్లో జంటగా చేసి మెప్పించారు. అలాంటి ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొని ఉంటుందని ఎవరు ఉహించి ఉండరు. అసలు పోటీ అనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. పూర్తి మాటర్ ఏంటో చూద్దాం
సమంత నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం'. నందినీ రెడ్డి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకోవడంతో మొదట అనుకున్న మే 15 విడుదల తేదీని మార్చి, జూన్ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. 'జననాయగన్' కూడా అదే జూన్ 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ కంటే ముందు విజయ్ చేసిన చిత్రం కావడం, రిలీజ్ లేట్ అవ్వడం, పైగా ఆఖరి మూవీ కావడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో ఓపెనింగ్స్ కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కి అద్భుతమైన మార్కెట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వైపు లేడీ సూపర్ స్టార్ క్రేజ్, మరోవైపు దళపతి మాస్ ఫాలోయింగ్ మధ్య థియేటర్ల వద్ద కలెక్షన్ల యుద్ధం ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని సినీ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నిరాశేనా!.. అంచనాలు తారుమారు
'మా ఇంటి బంగారం'ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ తో పాటు 'తస్సదియ్య' సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ హల్చల్ చేస్తున్నాయి. కాకపోతే జన నాయగన్ దెబ్బకి మా ఇంటి బంగారంకి థియేటర్స్ దొరకడం కొంచం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.







