విజయ్ `బీస్ట్`.. ఆ రేస్‌లో లేనట్టే
on Sep 23, 2021
కోలీవుడ్ స్టార్ విజయ్ ఫిల్మోగ్రఫీ గమనిస్తే.. ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. రీసెంట్ టైమ్స్ లో తన సినిమాల్లో సింహభాగం ఫెస్టివల్ సీజన్స్ లో సందడి చేసినవే. మరీముఖ్యంగా.. పొంగల్ టైమ్ లో వచ్చిన విజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇక విజయ్ ప్రీవియస్ పొంగల్ మూవీ `మాస్టర్` అయితే తమిళనాటే కాదు తెలుగులోనూ అనువాద రూపంలో అదరగొట్టింది. ఈ క్రమంలో.. విజయ్ నెక్స్ట్ వెంచర్ `బీస్ట్` కూడా పొంగల్ నే టార్గెట్ చేసుకుందని కొన్నాళ్ళ క్రితం వరకు ప్రచారం సాగింది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2022 పొంగల్ రేస్ లో లేనట్టేనట. `బీస్ట్`కి సంబంధించిన చిత్రీకరణ పూర్తవడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముందని కోలీవుడ్ టాక్. దీంతో.. 2022 సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట యూనిట్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న `బీస్ట్`లో విజయ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్న తాజా చిత్రం `వలిమై`.. 2022 పొంగల్ కి థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read