సేమ్ డే(ట్).. దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ సందడి!
on Sep 18, 2021
ఈ సెప్టెంబర్ 20.. దగ్గుబాటి వారి అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజు అటు దగ్గుబాటి బాబాయ్ విక్టరీ వెంకటేశ్ - ఇటు దగ్గుబాటి అబ్బాయ్ రానా తమ కొత్త చిత్రాలకు సంబంధించి
ఫస్ట్ లుక్స్ తో సందడి చేయనున్నారు. విశేషమేమిటంటే.. వారిద్దరి ఫస్ట్ లుక్స్ కూడా మాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ కి రీమేక్స్ గా తెరకెక్కుతున్న సినిమాల నుంచే వస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2`.. తెలుగులో అదే పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. `దృశ్యం` తెలుగు రీమేక్ లో నటించిన వెంకీ.. ఈ సీక్వెల్
రీమేక్ లోనూ కొనసాగుతున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన కథానాయకుడి పాత్ర రాంబాబు తాలూకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని సెప్టెంబర్ 20 ఉదయం 10.08 గంటలకి రివీల్ చేయనున్నారు.
ఇక అదే రోజు `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా తెరకెక్కుతున్న `భీమ్లా నాయక్` నుంచి రానా పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని `బ్లిట్స్ ఆఫ్ డేనియల్ శేఖర్` పేరుతో గ్లింప్స్ గా
రిలీజ్ చేయబోతున్నారు. మరి.. సేమ్ డే(ట్)కి దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ ఇస్తున్న ఈ సర్పైజెస్ ఫ్యాన్స్ ని ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాయో చూడాలి.
Also Read