
మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Ss Rajamouli)ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని ఇండియన్ చిత్ర సీమకి పరిచయం చేస్తుంది. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వారణాసి ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
సాధారణంగా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు సోషల్ మీడియాలో ఉచితంగా వస్తుంటాయి. కానీ, రాజమౌళి ఈసారి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమా మేకింగ్ వీడియోలు, బిహైండ్ ద సీన్స్, నటీనటుల ఇంటర్వ్యూలు మరియు ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను నేరుగా అభిమానులకు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి 'వారణాసి' అనే కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే వారణాసిని తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని, ఆసక్తికరమైన బి టి ఎస్ వీడియోస్ చూడాలని అనుకునే వాళ్ళు 199 రూపాయలు చెల్లించి వారణాసిని సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ లో వారణాసికి సంబంధించి మహేష్,ప్రియాంకకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోలతో పాటు మిగతా ఆర్టిసుల డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వారణాసి వివరాలన్నీ మీ పాకెట్ లో ఉండబోతున్నాయి. గతంలో కొన్ని హాలీవుడ్ చిత్రాలకి అనుసరించే ఈ విధానాన్ని ఇండియాలో రాజమౌళి ప్రవేశపెడుతుండటం విశేషం.
Also read: Santhosh Nair: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం
రాజమౌళి ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేపథ్యంలో మహేష్ బాబు సినిమాతో ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రవేశపెడుతున్న ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇది క్లిక్ అయితే, భవిష్యత్తులో మిగిలిన పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.






