Home

»

Latest News

మహేష్ బాబుకి మామ‌గా మోహ‌న్ బాబు.. మ‌ర‌ద‌లిగా మిస్ మీన‌న్!

Jan 25, 2022

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ది క్లాస్ కాంబినేష‌న్. వీరిద్ద‌రూ జ‌ట్టుకట్టిన `అతడు`, `ఖ‌లేజా` చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేశాయి. క‌ట్ చేస్తే.. దాదాపు ప‌న్నెండేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మూడో సినిమా రాబోతోంది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో మ‌హేశ్ కి జోడీగా `బుట్టబొమ్మ‌` పూజా హెగ్డే క‌నిపించ‌నుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నారు. ఏప్రిల్ లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా.. 2023 సంక్రాంతికి సంద‌డి చేయ‌నుంద‌ని బ‌జ్.

Also Read: 'వై ఐ కిల్డ్ గాంధీ'ని పూర్తిగా బ్యాన్ చెయ్యాలి!

ఇదిలా ఉంటే.. మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఇందులో మ‌హేశ్ బాబుకి మామ‌య్య‌గా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో  ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ట‌. అంతేకాదు.. `భీమ్లా నాయ‌క్`లో రానా ద‌గ్గుబాటికి జంట‌గా న‌టిస్తున్న సంయుక్తా మీన‌న్ ఇందులో మ‌హేశ్ కి మ‌ర‌ద‌లుగా క‌నిపిస్తుంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com