‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మరోసారి ఫిక్స్.. మొదలైన కౌంట్‌డౌన్!
on Dec 9, 2025
- ఒక రేంజ్‌లో యశ్ క్యారెక్టరైజేషన్
- ఈసారి అనిరుధ్ రవిచందర్‌దే బాధ్యత
- నెక్స్‌ట్ లెవల్‌లో పిక్చరైజేషన్
‘కెజిఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా హీరో యశ్‌కి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత యశ్ చేయబోతున్న సినిమా ఏమిటి? అది ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే చర్చ ముమ్మరంగా జరిగింది. కెజిఎఫ్ సిరీస్‌తో హీరోకి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో మాక్సిమమ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దాన్ని కంటిన్యూ చేసేలా నెక్స్‌ట్ సినిమా ఉండాలి. అయితే అతని నెక్స్‌ట్ మూవీ ‘టాక్సిక్’ని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే యశ్‌కి ఉన్న క్రేజ్‌ని ఏమాత్రం తగ్గించకుండా ‘టాక్సిక్’ చిత్రాన్ని గీతూ నెక్స్‌ట్ లెవల్‌లో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
Also Read: విషాదాంతమైన హీరోయిన్ జీవితం.. ఆ బయోపిక్‌లో రష్మిక మందన్న?
పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంలో యశ్ తన నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే డిస్కషన్ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్ అవ్వదని, వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.
ఆ వార్తలకు చెక్ పెడుతూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో యశ్ ఏ రేంజ్‌లో కనిపించబోతున్నాడు అనేది ఈ పోస్టర్ తెలియజేస్తోంది. అంతేకాదు ‘100 డేస్ టు గో’ అంటూ ఒక క్యాప్షన్ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. 2026 మార్చి 19న ‘టాక్సిక్’ అనే భారీ యాక్షన్ మూవీతో యశ్ రాబోతున్నాడు అని మరోసారి కన్‌ఫర్మ్ చేశారు.
Also Read: చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!
కెజిఎఫ్ తర్వాత అన్ని ఏరియాల్లోనూ యశ్‌కు అభిమానులు ఏర్పడ్డారు. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ను స్ట్రాంగ్‌గా కన్‌ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. యశ్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ‘టాక్సిక్’ క్యాస్టింగ్ కూడా చాలా సాలిడ్‌గా ఉంది. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీలాంటి స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో ఉండడం సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్ కాబోతోంది.
‘కెజిఎఫ్’ సిరీస్‌లో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో బాక్సులు బద్దలు చేసిన రవి బస్రూర్‌ను కాకుండా మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు ‘టాక్సిక్’ మ్యూజిక్ చేసే బాధ్యతను అప్పగించారు. ఇండియాలో నిర్మాణం జరుపుకుంటున్న భారీ చిత్రాల్లో ఒకటైన ‘టాక్సిక్’ని కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌తో యశ్ హంగామా మొదలైంది. ముఖ్యంగా కర్ణాటకలో యశ్ అభిమానుల్లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



