
-రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన అలేఖ్య
-ఆమె మాట్లాడిన అంశాలేంటి
-బాలయ్య, తారకరత్న గురించి ఏం చెప్పింది
నందమూరి అభిమానులని,ప్రేక్షకులని దుఃఖసాగరంలో ముంచుతు 2023 ఫిబ్రవరి 18 న నందమూరి తారకరత్న( Nandamuri Tarakarathna)హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఊహించని ఆ సంఘటనతో షాక్ అవ్వని తెలుగు వారు లేరు. అంత అనుబంధం నందమూరి కుటుంబానికి తెలుగు వాళ్ళకి మధ్య పెన వేసుకొని ఉంది. రీసెంట్ గా తారకరత్న భార్య అలేఖ్య(Alekya) ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన పలు మాటలతో బాలకృష్ణ, తారకరత్న మధ్య ఉన్న ఒకే సారూప్యం మరో సారి తెలియచేసినట్లయింది. ఆ మాటలేంటో చూద్దాం.
తారక్‌ని నేను హైదరాబాద్‌లోనే కలిశాను. ఆయన సినిమాలు చూడలేదు. నాకు ఫ్రెండ్‌గా పరిచయం అయ్యారు. ఎంత మంచి ఫ్రెండ్ అంటే నీకోసం వచ్చాడంటే అలా నిలబడిపోతాడు. ఏదైనా చేస్తాడు. ఎంత దూరం అయినా వెళ్తాడు. చిన్న పిల్లోడి మనస్తత్వం. అలాంటి క్వాలిటీ బాల బాబాయ్ (బాలకృష్ణ) లో కూడా ఉంది. నా అనుకుంటే ఎంతదూరం అయినా వెళ్తారు. ఎవర్నైనా వరసలు పెట్టి పిలించేంతగా కలిపేసుకుంటారని చెప్పింది.
also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం
ఇప్పుడు ఈ మాటలతో బాలకృష్ణ(Balakrishna)తారకరత్న మధ్య ఉన్న అనుబంధాన్ని అభిమానులు మరో సారి గుర్తు చేసుకుంటున్నారు. తారకరత్నని సినీ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది బాలకృష్ణనే. ఆ ఇద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో కనపడే ఎన్నో పిక్స్ ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తుంది. తారకరత్న కి కూడా బాలకృష్ణ అంటే ఎంతో ప్రాణం.







