Home

»

Latest News

‘ఇల్లాలు ఇటుక ముక్క.. ప్రియురాలు పటిక ముక్క’.. సెటప్‌తో దొరికిపోయిన భరణి!

Apr 11, 2026

తనికెళ్ల భరణి నటుడిగానే కాకుండా కవిగా, రచయితగా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కామెడీ అయినా, విలనీ అయినా అద్భుతంగా పోషించే భరణి ‘దొంగరాముడు అండ్ పార్టీ’ చిత్రంలో చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటుంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్, లయ, కష్ణభగవాన్, భువనేశ్వరి, తనికెళ్ల భరణి, కొండవలస తదితరులు నటించారు. ఆద్యంతం కామెడీని అందించే వీడియో మీకోసం అందిస్తున్నాం. 

ఈ వీడియోలో భరణి తనదైన గోదావరి యాసలో హీరోయిన్‌ను బ్రతిమిలాడటం చూడవచ్చు. “ఐ యామ్ సారీ అమ్మ.. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను” అంటూ ఆయన చెప్పే డైలాగుల్లో ఒక విలక్షణమైన హావభావాలు కనిపిస్తాయి. ఎన్ని గొడవలున్నా అవసరాల దగ్గరకు వచ్చేసరికి ఆయన చూపే ఆత్రుత కడుపుబ్బ నవ్విస్తుంది.

ఈ వీడియోలో అసలైన కామెడీ పండేది భరణి తన భార్యను, ప్రియురాలిని పోల్చి చూసే సందర్భంలో. “కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్‌” అంటూ ఆయన చేసే ఫిలాసఫీ, ఆ గొంతులో ఉండే గాంభీర్యం సీన్‌ను ఎక్కడికో తీసుకెళ్తాయి. తన భార్య ముఖాన్ని “తవ్వకాల్లో దొరికిన కుండ పెంకు”తో పోల్చడం, అదే సమయంలో పక్కనున్న అమ్మాయిని “పాలరాతి శిల్పం” అని పొగడటం కేవలం తనికెళ్ల భరణికే సాధ్యమైన విద్య.

ఈ కామెడీ సీక్వెన్స్‌లో హైలైట్ ఏంటంటే.. “ఇల్లాలు ఇటుక ముక్క.. ప్రియురాలు పటిక ముక్క” అనే కవిత్వం. ఒక రచయితగా భరణి ఆ పదాలను ఎంత లౌక్యంగా, హాస్యం అందించే విధంగా పలికారో చూస్తుంటే ముచ్చటేస్తుంది. చివరికి తన పెళ్ళాం అక్కడికి వచ్చేసరికి ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సీన్ మొత్తానికి హైలైట్.

అద్భుతమైన నటనతో, అంతకు మించిన వాచకంతో తనికెళ్ల భరణి పండించిన ఈ హాస్యరసం ‘తెలుగువన్‌’ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇలాంటి చక్కని వినోదాన్ని అందించే వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com