ఓ సినిమాలో వదినగా, మరో సినిమాలో ఐటమ్ గాళ్‌గా.. వరుణ్‌తో మిల్కీ బ్యూటీ!
on Jul 25, 2021
సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఇదే జూలై 25న విడుదలైన `అల్లుడు శీను` (2014) కోసం.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఆపై `స్పీడున్నోడు`(2016), `జాగ్వార్` (2016), `జై లవ కుశ`(2017), `కేజీఎఫ్: ఛాప్టర్ 1` (2018) , `సరిలేరు నీకెవ్వరు`(2020) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో చిందులేసింది ఈ డాన్సింగ్ సెన్సేషన్. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరోమారు స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరవనుందట తమన్నా.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా `గని` పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కాగా, ఈ సినిమాలో కథానుసారం ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. అందులో తమన్నా దర్శనమివ్వనుందని వినికిడి. అంతేకాదు.. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే `గని`లో తమన్నా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. తొలిసారిగా మెగా కాంపౌండ్ లో ఐటమ్ నంబర్ చేస్తున్న తమన్నా.. భవిష్యత్ లోనూ ఆ క్యాంప్ లో మరిన్ని స్పెషల్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న మరో సినిమా `ఎఫ్ 3`లో అతనికి వదినగా నటిస్తోంది తమన్నా. కాగా, తక్కువ గ్యాప్ లోనే `గని`, `ఎఫ్ 3` థియేటర్స్ లో సందడి చేయనున్నాయని సమాచారం.
Also Read