Home

»

Latest News

Baahubali: బాహుబలి ఫ్లాప్ అయి ఉంటే... తమన్నా షాకింగ్ కామెంట్స్

May 22, 2026 12:01PM

 

ఇండియన్ సినీ పరిశ్రమలో బాహుబలికి ఉన్న స్థానం ఎంతో అందరకి తెలిసిన విషయమే . 'బాహుబలి'కి ముందు, బాహుబలికి తర్వాత అని కూడా భారతీయ చలనచిత్ర చరిత్రని విభజించవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని కూడా నెలకొల్పింది. సదరు రికార్డులు చెరిగిపోవడం అనేది జరగని పని. అటువంటి బాహుబలి గురించి తమన్నా చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


తమన్నా మాట్లాడుతు ,బాహుబలి 'ది బిగినింగ్' చిత్రాన్ని సుమారు 200  కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ సమయంలో ప్రాంతీయ భాషా చిత్రానికి అంత భారీ మొత్తంలో పెట్టుబడి  అనేది ఒక రకమైన జూదమే. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయి ఉంటే,  ఇండస్ట్రీలోనే ఒక పెద్ద విపత్తు సంభవించేది. నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోయేవారు.

మొదటి భాగం విజయం ఇచ్చిన నమ్మకంతోనే, రెండో భాగం 'బాహుబలి 2: ది కంక్లూజన్' చిత్రాన్ని  250 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తెరకెక్కించారు. అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ సరైన కథా బలం రాజమౌళి గారి విజన్. కేవలం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినంత మాత్రాన సినిమాలు ఆడవని ఆమె తేల్చి చెప్పారు.


Also read: Gaayapadda simham: ఓటీటీలోకి వచ్చేసిన గాయపడ్డ సింహం.. ఇది కూడా ట్రంప్‌పై ప్రతీకారమేనా!  

 బాలీవుడ్ చిత్రాల బడ్జెట్ మేకింగ్‌పై తమన్నా ఆసక్తికరమైన విమర్శలు చేశారు. బాలీవుడ్‌లో వందల కోట్ల భారీ బడ్జెట్‌లని  కేవలం నటీనటుల పారితోషికాలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మరి స్క్రీన్ మీద క్వాలిటీ  చూపించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. బాహుబలి' విషయంలో రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ తప్పు చేయలేదని ప్రశంసించారు. వారు బడ్జెట్‌లో ఎక్కువ శాతాన్ని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ సెట్లు, ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సాంకేతిక నాణ్యత కోసమే కేటాయించారని చెప్పారు. బాహుబలి రెండు భాగాల్లో  అవంతిక గా మెప్పించి సినిమా విజయంలో తను కూడా ఒక భాగమైన  విషయం తెలిసిందే.


  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com