మరో పాన్ ఇండియా మూవీ వాయిదా.. అసలు కారణమిదే!
on Jan 24, 2026

పాన్ ఇండియా సినిమాలు, అందునా వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉన్న సినిమాలు వాయిదా పడటం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా చేరింది.
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ చూసిన నిఖిల్(Nikhil Siddhartha), ఇప్పుడు 'స్వయంభు'(Swayambhu) అనే మరో పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.
'స్వయంభు' సినిమాను 2026, ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
'స్వయంభు' నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ ఉన్న సినిమా. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇండియాలో టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ కి కావాల్సినంత సమయం తీసుకొని, దీనిని విజువల్ వండర్ లా మార్చాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

Also Read: 2026 మెగా నామ సంవత్సరం.. మూడు నెలల్లో మూడు సినిమాలు!
స్వయంభులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ ఆకట్టుకుంది.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న స్వయంభులో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్, ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్లుగా ఎం ప్రభాహరన్, రవీందర్ వర్క్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



