Home

»

Latest News

శ్రీనివాస మంగాపురం నుంచి మూడో సాంగ్ రిలీజ్.. ఈ సారి స్పెషల్ ఇదే 

Jul 20, 2026 3:37PM


శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)తో వస్తున్న ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ(jaya Krishna)రాక కోసం అభిమానులతో పాటు  సెల్యులాయిడ్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. బాక్స్ ఆఫీస్ సైతం జయకృష్ణ సృష్టించే రికార్డులు ఎలా ఉంటాయో అనే అతృతతో ఉంది. రీసెంట్ గా మేకర్స్ మూడో సాంగ్ ని రిలీజ్ చేసారు. 

‘రావే చెలియా.. నా ప్రాణం నను వీడి.. నీ వైపే కదిలేనే’ అనే లిరిక్స్‌తో బ్యూటిఫుల్ రొమాంటిక్ గా సాగింది. ఈ హృద్యమైన గీతాన్ని ప్రముఖ గాయకుడు కపిల్ కపిలన్ తనదైన శైలిలో ఎంతో మధురంగా ఆలపించగా, నాగ్‌ అర్జున్‌ రెడ్డి ఈ పాటకు ప్రాణం పోసేలా హృదయాలను హత్తుకునే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సమకూర్చిన ఈ ట్యూన్ వినగానే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ,యూట్యూబ్‌లో వేల సంఖ్యలో వ్యూస్‌  సాధిస్తూ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.  ముఖ్యంగా హీరో హీరోయిన్లు జయకృష్ణ, రాషా థడానీల మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, లవ్ కెమిస్ట్రీ కంటికి ఎంతో ఇంపుగా కనిపిస్తున్నాయి. తిరుపతి, దాని పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇదని ఈ పాట వింటుంటేనే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన 'మంగా మంగా', 'అలెల్లే అలెల్లే' వంటి గత పాటల విజయాల తర్వాత, ఈ మూడో పాట కూడా యూత్‌ ని, ముఖ్యంగా సంగీత ప్రియులని  విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాపై ఉన్న హైప్‌  మరింతగా పెంచేసింది.  

Also read: థియేటర్లలో మళ్ళీ కర్చీఫ్‌లు పంచే రోజులు వస్తాయా!..వస్తే ప్రేక్షకుల పరిస్థితి ఏంటి!


నిజానికి ఈ సినిమాను జూలై రెండో వారంలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇతర పెద్ద చిత్రాల పోటీని నివారించేందుకు జూలై 30కి వాయిదా వేసి, సోలోగా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడు’ అనే ఒక అత్యంత శక్తివంతమైన క్యారెక్టర్స్ లో కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కనిపిస్తుండటం శ్రీనివాస మంగాపురంకి ప్రత్యేక బలం. ఆర్ ఎక్స్ 100 ,మంగళవారం’ వంటి విభిన్నమైన సంచలన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన కల్ట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వైవిధ్యభరిత దర్శకుడు అజయ్ భూపతి  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. సి. అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మించాడు.

jayakrishna, srinivasa mangapuram, Rasha Thadani, ajay bhupathi


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com