
శ్రీకాంత్(srikanth),రమ్యకృష్ణ(Ramyakrishna)అనేక చిత్రాల్లో చేసినప్పటికీ ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన 'ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు'(English Pellam East Godavari Mogudu)కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 1999 లో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టగా నేటికీ చూసినా కొత్తగానే ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి కానీ యువతీ యువకులు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి డేటింగ్ లో ఉంటున్నారు కదా.. ఆ డేటింగ్ పాయింట్ తోనే ఈ చిత్రం తెరకెక్కింది.
సాంబశివరావు(శ్రీకాంత్) ఈస్ట్ గోదావరిలోని ఒక పల్లెటూరుకి చెందిన సరదా యువకుడు. పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు. కానీ కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనిషి. శిరీష (రమ్యకృష్ణ) విదేశాల్లో చదువుకొని వచ్చిన అమ్మాయి. దీంతో అక్కడ ఎక్కువ శాతం మంది ఫాలో అయ్యే అలవాట్లని కలిగి ఉంటుంది. పైగా దూకుడు స్వభావం కలగలిపిన యువతితో పాటు తన మాటే గెలవాలనే మొండి పట్టుదల తన సొంతం.ఆ క్రమంలో మంచి చెడుకి తేడా కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి సాంబశివరావు తో డేటింగ్ చేస్తుంది. ప్రపంచం మొత్తం శిరీష చేసేది తప్పని అంటున్నా సాంబశివరావు మాత్రం డేటింగ్ కరెక్ట్ అంటాడు. డేటింగ్ లో తనని పసిపిల్లలాగా కూడా చూసుకుంటాడు. కానీ సాంబశివరావుకి శిరీష యాంటీగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. కింద ఉన్న వీడియోలో డేటింగ్ కి సంబంధిచిన సీన్ ఉంది.
శ్రీకాంత్ రమ్యకృష్ణ మధ్య వచ్చే ఆ సన్నివేశం తెలుగు వెండితెరపై ఒక అద్భుతమైన మాస్టర్‌పీస్. అసలు ఈ సినిమా పేరు వినగానే వినోదాత్మకమైన అంశాలు గుర్తుకొస్తాయి. సదరు సన్నివేశం కూడా అదే కోవలోనే సాగినా ప్రేక్షకుల హృదయాలని బరువుెక్కిస్తుంది.శ్రీకాంత్, రమ్యకృష్ణ పోటీ పడి నటించారు.ఆ కెమిస్ట్రీ సీన్ లోని డ్రామాని మరింత పండించింది.
మూవీ మొత్తంపై చూసుకుంటే మధ్యతరగతి గోదావరి వ్యక్తిగా, ఆత్మగౌరవానికి మరియు ప్రేమాభిమానాలకు మధ్య నలిగిపోయే భర్త క్యారక్టర్ లో శ్రీకాంత్ ఒదిగిపోయారు. ఆయన కళ్ళలో కనిపించే ఆవేదన, గొంతులో వణకు సగటు మనిషి పడే సంఘర్షణను ప్రతిబింబిస్తాయి. తనదైన శైలిలో గంభీరమైన నటనను ప్రదర్శించారు. రమ్య కృష్ణ అయితే ఒక ఆధునిక భావాలున్న యువతిగా, ఒక ఆడదానిగా తన తప్పుని తెలుసుకున్నప్పుడు కలిగే పశ్చాత్తాపాన్ని ఎంతో హుందాగా పలికించారు. కేవలం మాటలతోనే కాకుండా, మౌనంతో కూడా భావాలను పండించడంలో ఆమె ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.
భార్యాభర్తల మధ్య గొడవ మాత్రమే కాదు. సంప్రదాయానికి ,ఆధునికతకు మధ్య జరిగే ఒక భావోద్వేగ యుద్ధం. ఈస్ట్ గోదావరి సంస్కృతిలో ఉండే ఆత్మీయతను, అనుబంధాలను అర్థం చేసుకోవడంలో కలిగే పొరపాట్లు ఎలా ఉంటాయో కూడా మూవీలో చూడవచ్చు.
Also read: Anna KOnidela: 15 ఏళ్ళ కన్యూజ్‌కి తెరదించిన అన్నా కొణిదెల.. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో
సంభాషణలు నేరుగా హార్ట్ కి తగిలేలా ఉంటాయి. నేటి కాలంలో వస్తున్న యాక్షన్ మరియు థ్రిల్లర్ సినిమాల మధ్య, ఇలాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. మురళి మోహన్, బ్రహ్మాజీ, ప్రసాద్ బాబు తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అన్నమయ్య, సింహాద్రి ఫేమ్ దొరస్వామి రాజు నిర్మాత కాగా సురేష్ వర్మ(Suresh Varma)దర్శకుడు. మణిశర్మ స్వరపరిచిన సాంగ్స్ కూడా మెప్పిస్తాయి






