సోనియా, చరణ్ కథేంటి?
on Jun 27, 2022
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన మరోసారి వివాహం చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలే అందుకు కారణం. ఎస్పీ చరణ్ సింగర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ఒక మాజీ హీరోయిన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ఆయన ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఆ మాటలకు ఊతం అందిస్తున్నట్లుగానే ఉన్నాయి. వరుసగా షోస్ చేస్తూ, పాటలు పాడుతూ బాలు గారు లేని లోటుని తీరుస్తున్నారు చరణ్. తెలుగులో 'పాడుతా తీయగా' అనే పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే, మరో పక్క తమిళంలోనూ కొన్ని షోస్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన పెళ్లి విషయం సోషల్ మీడియాకి హాట్ కేక్ అయ్యింది. '7/జి బృందావన్ కాలనీ' ఫేమ్ సోనియా అగర్వాల్ ని ఆయన పెళ్లి చేసుకునేందుకు రెడీ ఐనట్టు తెలుస్తోంది. 'కొత్తగా ఏదో జరగబోతోంది' అంటూ పెట్టిన టాగ్ లైన్ వల్ల రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి.
'చరణ్ మూడో పెళ్ళికి, సోనియా రెండో పెళ్ళికి ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్' అంటూ నెటిజన్స్ ఈ ఫొటోస్ కి కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ ఏమనుకున్నారో ఏమో వెంటనే ఇంకో ఫోటో కూడా రిలీజ్ చేసేశారు. సోనియా, చరణ్, ఇంకో నటుడు, అంజలి కూడా ఉన్న ఫోటో అది. పెళ్లి వార్తలకు బ్రేక్ వేసేందుకు వెబ్ సిరీస్ పేరుతో ఈ ఫోటో కావాలనే పోస్ట్ చేశారా.. అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ నెటిజన్స్ మాత్రం ఆ ఫొటోస్ లోని లాజిక్స్ ని బయటకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. 'అంజలి ఉన్నప్పుడు మొదట మీ ఇద్దరి ఫోటో మాత్రమే ఎందుకు పెట్టారు?' అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. '7/జి బృందావన్ కాలనీ' మూవీతో పాపులర్ ఐన సోనియా వరుస ఆఫర్స్ తో సక్సెస్ ని అందుకుంది. బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను ప్రేమించి 2006లో వివాహం చేసుకుంది. ఐతే నాలుగేళ్లకే ఈ జంట విడిపోయింది. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు ఊపందుకునేసరికి అది ఇదేనేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
అభిమానులకు వెబ్ సిరీస్ అని చెప్పి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారేమో అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇటీవల బ్రేకప్స్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువయ్యాయి. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ మ్యారేజెస్ చేసుకోవడం కూడా ఒక ఫ్యాషన్ ఐపోయింది. మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా కేవలం వెబ్ సిరీస్ కి ఫోజులిచ్చారా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.